Eagle Postponed : సంక్రాంతి పోటీ నుంచి రవితేజ ఔట్.. వాయిదా పడ్డ ‘ఈగల్’.. అసలు కారణం ఇదే!

By Nuthi SrikanthFirst Published Jan 4, 2024, 10:12 PM IST
Highlights

‘సంక్రాంతి’ సినిమాలకు పోటీ పెరిగింది. ఏకంగా ఐదు సినిమాలో బరిలో ఉన్నాయి. దీంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ లో రవితేజ ‘ఈగల్’ సినిమా వాయిదాకు ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు. అందుకు కారణాలను ప్రొడ్యూసర్ దిల్ రాజు వివరించారు. 

ఈ సారి సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు మహేశ్ బాబు Mahesh Babu ‘గుంటూరు కారం’ Guntur Kaaram, విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’ (Saindhav), అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ (Naa Samiranga), మాస్ మహారాజా రవితేజ ‘ఈగల్’ (Eagle), యంగ్ హీరో తేజా సజ్జా ‘హనుమాన్’ HanuMan విడుదలకు సిద్ధమయ్యాయి. 

నిర్మాతల మండలి సమావేశంలో ‘ఈగల్’ మూవీ నిర్మాత విశ్వప్రసాద్ పరిస్థితిని అర్థం చేసుకొని వాయిదా వేసుకునేందుకు ఒప్పుకున్నారన్నారు. దీంతో Eagle Movie ఫిబ్రవరి నెలకు వాయిదా పడిందన్నారు. ఆ సినిమాకు సోలో డేట్ ఫిక్స్ చేసిన రిలీజ్ కు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని కౌనిల్ హామీనిచ్చారు. 

Latest Videos

ఇక మహేశ్ బాబు ‘గుంటూరు కారం’కు ఎక్కువ థియేటర్లు కేటాయించినట్లు, ఆ తర్వాత వెంకటేశ్’ సైంధవ్’కు, తర్వాత నాగార్జున ‘నా సామిరంగ’కు థియేటర్లకు కేటాయించారని తెలిపారు. దీంతో ‘ఈగల్’ థియేటర్లు దొరడం లేదు. అందుకు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఇక థియేటర్ల సమస్య ‘హనుమాన్’కూ తప్పడం లేదు. 

ఇప్పటికే రిలీజ్ విషయంలో ‘హనుమాన్’ వెనక్కి తగ్గేదేలే అంటూ డైరెక్టర్, మేకర్స్ స్పష్టం చేశారు. ఇది పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇక్కడ థియేటర్ల విషయంలో సమస్య ఏర్పడినా.. ఇతర స్టేట్స్ లో పర్వాలేదు. అందుకే రిలీజ్ కి వెళ్తున్నారు, కానీ ‘ఈగల్’కు మరీ కష్టం అవుతుంది. దీంతో బ్యాక్  అయినట్టు సమాచారం.

click me!