
మనకున్న కమర్షియల్ డైరక్టర్స్ లో కె.ఎస్.రవీంద్ర(బాబి- KS Ravindra) ఒకరు. రవితేజ (Ravi Teja) హీరోగా 'పవర్' (Power) చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యారు కె.ఎస్.రవీంద్ర(బాబి- KS Ravindra). ఆ తరవాత వరసపెట్టి మాస్, కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లతో సైతం ఇప్పటికే సినిమాలు చేసారు. అలాగే చిరంజీవి,రవితేజ తో తీసిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'వీరమాస్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ నేపధ్యంలో బాబి చేయబోయే నెక్ట్స్ మూవీ ఏమిటనేది డిస్కషన్ గా మారింది.
మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బాబీ...మరోసారి రవితేజతో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజకు ఓ స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించారని వినికిడి. ఈ మేరకు కొందరు అసెస్టెంట్ లతో ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రజల మనిషి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుస సినిమాలు చేయటానికి ఎగ్రిమెంట్ చేసారు రవితేజ. ‘ధమాకా’తో మొదలెట్టారు. ఇప్పుడు హరీష్ శంకర్‌తో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే తెరకెక్కిస్తోంది. ఇదే క్రమంలో బాబీతోనూ సినిమా చేయటానికి పీపుల్ మీడియా సంస్థ ముందుకు కొచ్చింది. ఇదే సంస్ద..బాబితో గతంలో ‘వెంకీ మామా’ సినిమాని రూపొందించింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా లాభాలు తెచ్చిపెట్టింది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.