రూమర్లు నిజం చేసిన ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌.. అంబానీ పెళ్లిలో బట్టబయలు..

Published : Jul 13, 2024, 09:56 PM ISTUpdated : Jul 13, 2024, 09:58 PM IST
రూమర్లు నిజం చేసిన ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌.. అంబానీ పెళ్లిలో బట్టబయలు..

సారాంశం

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌, బిగ్‌ బీ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ అంబానీ పెళ్లిలో పెళ్లి చేసిన పని ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌.. బాలీవుడ్‌ బిగ్‌ బిజీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు, హీరో అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కూతురు ఆద్య కూడా జన్మించింది. ఆ అమ్మాయి పెద్దదైంది. ఇన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతుందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్‌ మీడియా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నట్టు వార్తలు ప్రచురిస్తుంది. దీంతో తరచూ రూమర్లు వస్తూనే ఉన్నాయి. 

అయితే ఆ రూమర్ల తర్వాత కూడా అభిషేక్‌, ఐశ్వర్య కలిసి కనిపించారు. అమితాబ్‌ ఫ్యామిలీతోనూ ఐష్‌ మెరిసింది. దీంతో ఆయా రూమర్లకి చెక్‌ పెట్టినట్టయ్యింది. కానీ డైవర్స్ రూమర్స్ ఆగడం లేదు. ఏదో రూపంలో వస్తూనే ఉన్నాయి. నిప్పులేనిదే పొగరాదంటారు. అలానే ఈ ఇద్దరి మధ్య గ్యాప్‌ లేనిదే ఈ రూమర్స్ ఎందుకు వస్తాయనేది ప్రశ్న. అయితే చాలా రోజులుగా ఐశ్వర్య.. అభిషేక్‌ బచ్చన్‌కి దూరంగానే ఉంటుందని, వేరే ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం. ఈ రూమర్స్ ఇలానే వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ వచ్చింది. 

అంబానీ పెళ్లిలో ఆ రూమర్లకి బలం చేకూరింది. నిజంగానే ఈ మాజీ విశ్వసుందరి, అభిషేక్‌ బచ్చన్‌ విడిపోతున్నారనే వార్తలు మరింతగా ఊపందుకునేలా చేసింది. ఈ పెళ్లికి అభిషేక్‌, ఐశ్వర్య వేర్వేరుగా వచ్చారు. మొదట అమితాబ్‌ బచ్చన్‌, ఆయన భార్య జయా బచ్చన్‌, కూతురు, అభిషేక్‌, కలిసి వచ్చారు. అంబానీ పెళ్లిలో ఫోటోలకు పోజులిచ్చింది. వీరిలో ఐశ్వర్య, ఆమె కూతురు మిస్సింగ్‌. 

ఆ తర్వాత కొద్దిసేపటికి ఐశ్వర్య, తన కూతురు ఆద్యతో కలిసి వచ్చింది. ఆమె విడిగా ఫోటోలు దిగింది. వీరితో కలవలేదు. కానీ పక్క పక్కనే కూర్చున్నారు. కానీ మాట్లాడుకోలేదు. దీంతో విడిపోతున్నారనే పూకార్లకి మరింత బలం చేకూరినట్టయ్యింది. విడిపోవడం ఖాయమనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ మీడియా దీనిపై కోడై కూస్తోంది. దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు నేషనల్‌ వైడ్‌గా వైరల్‌గా మారుతున్నారు. అంబానీ పెళ్లిని డామినేట్‌ చేసే స్థాయిలో ఐష్‌, అభిషేక్‌ విడిపోతున్నారనే వార్తలు వైరల్‌ అవుతుండటం గమనార్హం. మరి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చూడాలి. 

ఇక ఐశ్వర్యా రాయ్‌.. 1994లో మిస్‌ వరల్డ్ టైటిల్ గెలుచుకుని పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. `ఇరువుర్‌` అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత బలమైన కంటెంట్‌ ఉన్న, బలమైన పాత్రల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రేమించి అభిషేక్‌ బచ్చన్‌ని పెళ్లి చేసుకుంది. 2007లో వీరి వివాహం జరిగింది. వీరికి ఆద్య జన్మించింది. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ సెలక్టీవ్‌గా వెళ్తుంది. చివరగా ఆమె `పొన్నియిన్‌ సెల్వన్‌`లో మెరిసింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు