
ఈ సినిమా షూటింగ్ సమయంలో కో డైరక్టర్ గులాబి శ్రీను వర్క్ చూసిన రవితేజ చాలా మెచ్చుకున్నారట. అందులోనూ అతను ఈ కథకు చెప్పిన ఇన్ పుట్స్ సినిమాలో బాగా వర్కవుట్ అవటం గమనించారట. సినిమా సూపర్ హిట్ అవటంతో ..టీమ్ ని పిలిచి పార్టీ ఇచ్చారు రవితేజ. ఆ సమయంలో కో డైరక్టర్ ని మెచ్చుకుని ఓ కథ తెచ్చుకోమన్నారట చేద్దామని హామీ ఇచ్చారట. వెంటనే ఓ లైన్ చెప్పటం..దాని పూర్తి స్క్రిప్టు రాసుకురమ్మని రవితేజ అనటం వరసగా జరిగిపోయాయట. దాంతో ఇప్పుడు ఆ కో డైరక్టర్ ఆ స్క్రిప్టు పనిపై ఉన్నారట. అంత ధైర్యంగా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే గట్స్ కేవలం రవితేజకు మాత్రమే ఉన్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మాస్ మహారాజా ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్.. శ్రుతిహాసన్ గ్లామర్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ మాస్ కి బాగా కనెక్టయ్యాయని అందరూ ఒప్పుకున్నారు. మలినేని గోపీచంద్ ఈ సినిమాతో రవితేజతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోటయింది. రెండు రోజుల నుంచీ ఆహాలోనూ ఈ సినిమా దుమ్ము రేపుతోంది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా జనం కరోనా భయాల్ని వదిలి థియేటర్లకు వస్తుండడంతో ఇప్పుడు క్రాక్ కి ప్లస్ అయ్యింది.
అయితే ఈ ఆనందం నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం లేదట. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చూడాలని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్‌ను కోరాడు.
ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని ఫిర్యాదు తీసుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత తొందరగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.