ఆ విధంగా వడ్డే నవీన్, జూనియర్ ఎన్టీఆర్ బావ అవుతాడు!

Published : Feb 06, 2021, 03:43 PM IST
ఆ విధంగా వడ్డే నవీన్, జూనియర్ ఎన్టీఆర్ బావ అవుతాడు!

సారాంశం

వడ్డే నవీన్ నందమూరి కుటుంబం అల్లుడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన రామకృష్ణ కూతురిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. రామకృష్ణ కూతురుని వివాహం చేసుకోవడం ద్వారా వడ్డే నవీన్ జూనియర్ ఎన్టీఆర్ కి బావ అయ్యాడన్న మాట.

కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా వరుస హిట్స్ అందుకున్న వడ్డే నవీన్, ఆ  తరువాత ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. 1997లో విడుదలైన కోరుకున్న ప్రియుడు వడ్డే నవీన్ మొదటి చిత్రం. ఆ మూవీ మంచి విజయం అందుకోగా... అదే ఏడాది విడుదలైన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ పెళ్లి సూపర్ హిట్ అందుకుంది. దీనితో వడ్డే నవీన్ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ నవీన్ తండ్రి. 

కాగా వడ్డే నవీన్ నందమూరి కుటుంబం అల్లుడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ కుమారులలో ఒకరైన రామకృష్ణ కూతురిని వడ్డే నవీన్ వివాహం చేసుకున్నారు. రామకృష్ణ కూతురుని వివాహం చేసుకోవడం ద్వారా వడ్డే నవీన్ జూనియర్ ఎన్టీఆర్ కి బావ అయ్యాడన్న మాట. కారణం ఏమిటో కానీ వడ్డే నవీన్ మొదటి భార్యతో విడిపోవడం జరిగింది. 

ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, రెండో వివాహం చేసుకున్నారు. వరుస పరాజయాలతో వెనుకబడ్డ వడ్డే నవీన్ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. 2016లో వచ్చిన అటాక్ వడ్డే నవీన్ చివరి చిత్రం. వడ్డే నవీన్ రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి జన్మించారు. 


 

PREV
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్