టైగర్ హంటింగ్ కు టైమ్ ఫిక్స్ అయ్యింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రవితేజ టీమ్

By Mahesh JujjuriFirst Published Mar 29, 2023, 2:40 PM IST
Highlights

మంచి జోరు మీద ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. షూటింగ్స్ లో బిజీబిజీగా మారిన రవితేజ.. రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. 
 


వరుసగా లాస్ట్ ఇయర్ మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మాస్ మహారాజ్ రవితేజ అయితే క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా.. ధమాకా సినిమాతో  భారీ వసూళ్లను సాధించాడు.  వరుసగా హిట్లు కొడుతూ వస్తున్నమాస్ మహారాజ్.. ప్రస్తుతం హ్యాట్రిక్‌పై కన్నేశాడు. ఈఏడాది మెగాస్టార్ చిరంజీవితో కలిసి  వాల్తేరు వీరయ్యసినిమాతో వచ్చిన  రవితేజ సోలోగా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. అందులో భాగంగా.. రావణాసుర సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు.  మాస్ మహారాజ్ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రావణాసుర  టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను . ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతుననారు. 

ఇక రావణాసుర తరువాత కూడా మరో సినిమాతో బాక్సాపీస్ శేక్ చేయబోతున్నాడు రవితేజ. ఆయన  హీరోగా  టైగర్ నాగేశ్వర రావు' సినిమా రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1970 - 80లలో స్టువర్ట్ పురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు కథ ఇది. నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను, దసరా కానుకగా, అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు టీమ్. 

 

ఇక ముందుగా ఏప్రిల్ లో సందడి చేయబోతోంది రావణాసుర సినిమా. ఈసినిమాలో కాస్త నెగెటీవ్ శేడ్స్ ఉన్న పాత్ర చేశారు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ జంటగా ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించారు.  అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లా, దక్ష, పూజితా పొన్నాడ  ఈ మూవీలో సందడి చేయబోతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు లైన్ లో పెట్టాడు మాస్ మహారాజ్. వాటిని కూడా త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. 

click me!