రీరిలీజ్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ దేశముదురు, ఎప్పుడంటే..?

By Mahesh JujjuriFirst Published Mar 29, 2023, 1:38 PM IST
Highlights

ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలను అకేషన్ చూసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే.. మహేష్, పవన్, ఎన్టీఆర్, రీసెంట్ గా రామ్ చరణ్ సినిమాలు కూడా రీరిలీజ్ చేశారు. ఇక అల్లు అర్జున్ ఆల్ టైమ్ హిట్ మూవీని రీలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. 

ఈ మధ్య టాలీవుడ్ లో  రీరిలీజ్‌ల సందడి పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలు వెతుక్కుని మరీ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ముఖ్యంగా  హీరోల బర్త్‌డేలు.. చూసుకుని రీ రిలీజ్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ఏదైనా హీరో సినిమా పదేళ్లు.. ఇరవే ఏళ్లు పూర్తి చేసుకుంటే చాలు.. రీరిలీజ్ అనేస్తున్నారు.  ఈ ట్రెండ్ ను ఆ మధ్య మహేష్ ష్యాన్స్ స్టార్ట్ చేశారు. పోకిరితో స్టార్ట్‌ అయిన ఈ ట్రెండ్‌ రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డేసందర్భంగా రిలీజ్ అయిన ఆరెంజ్‌ వరకు వచ్చింది. ఈ మధ్యలో మహేష్ ఒక్కడు, పవన్ జల్సా, చరణ్ ఆరెంజ్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ దేశముదురు సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.  

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్‌ 6న దేశముదురు సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు  ప్రకటించారు మేకర్స్‌. ఈసినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. టాలీవుడ్ హీరోలగురించి బాలీవుడ్ హీరోయిన్ చులకనగా మాట్లాడటంతో.. అప్పట్లో బన్నీ ప్రస్టేజియస్ గా తీసుకుని సిక్స్ ప్యాక్ చేశారు. తెలుగులో మొదటి సిక్స్ ప్యాక్ హీరోగా అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అప్పుడప్పుడే హీరోగా మంచి క్రేజ్‌ తెచ్చుకుంటున్న బన్నీను ఈ సినిమా స్టార్‌ను చేసింది.  ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిజంతో పాటు.. ఆయన కామెడీ టైమింగ్.. మాస్ పంచులు.. డాన్స్ లేు ఫైట్లు.. అన్నీ సినిమాకు ప్లస్ గా మారాయి. 

 

Much awaited on the eve of Icon star ‘s birthday 🔥

Gear up to Re-Witness the STYLISH x MASS Swag of Bala Govind in theatres once again!

April 6th, Kummeskundham! 😎 pic.twitter.com/AYOsnFFhSX

— DVV Entertainment (@DVVMovies)

ఈసినిమా తెలుగుతో పాటు మలయాళ ఆడిన్స్ ను కూడా ఒక ఊపు ఊపేుసింది. అంతే కాదు.. ఈసినిమాలో బన్నీ హెయిర్ స్టైల్ ను.. అప్పట్లో యూత్ బాగా ఫాలో అయ్యారు. కేరళలో కూడా ఈ హెయిర్ స్టూల్ బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఈమూవీ బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపింది. కాసుల పంట పండించింది. పూరీ జగన్నాథ్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాతో  హన్సికా హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక ఈసినమిాలో పూరీ రాసిన డైలాగ్స్ కుర్రాళ్ళకు క్రిర్రెక్కించాయి. ఇక హన్సికా అందం.. అల్లు అర్జున్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 

 హన్సిక అందాల ఆరబోతకు యూత్‌ పిచ్చెక్కిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ సిక్స్‌ ప్యాక్ బాడీకి సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. ఇక అప్పట్లో ఈ సినిమా రూ.26 కోట్ల కలెక్షన్‌లు సాధించి.. ఆ ఏడాది హైయెస్ట్‌ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది.ఇక ఈసినిమా రిలీజ్ అయిన 16 ఏళ్లకు మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

click me!