
షాహిద్ కపూర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు నేచురల్ స్టార్ నానీ. జెర్సీ సినిమాలో తను పోషించిన అర్జున్ పాత్రకు న్యాయం చేశారంటూ షాహిద్ ను గట్టిగా పొగిడేశారు. ఇక లాంగ్ గ్యాప్ తీసుకుని రిలీజ్ అయిన హిందీ జెర్సీ గురించి నానీ రివ్యూ చూద్దాం.
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ ని హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాను జెర్సీ టైటిల్‌తోనే హిందీలో కూడా తెరకెక్కించారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది.
హిందీ జెర్సీలో షాహిద్ కపూర్ పోషించిన అర్జున్ క్యారెక్టర్ కు మంచి స్పందన వస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ఫిదా అవుతున్నారు ఆడియన్స్. ఇక ఈసినిమాపై స్పందించారు నేచురల్ స్టార్ నానీ. ఈ పాత్రకు షాహిద్‌కపూర్ పూర్తి న్యాయం చేశాడని నాని ట్వీట్ చేశాడు.
నానీ ట్వీట్టర్ లో ఈవిధంగా రాశారు. జెర్సీ చూశాను.. మా గౌతమ్ తిన్ననూరి మరోసారి ఈ సినిమాతో హిట్ కొట్టేనట్టే. షాహిద్‌కపూర్ అర్జున్ పాత్రను మనస్సు పెట్టి చేశాడు. షాహిద్, మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ సర్, మై బాయ్ రోనిత్ ఇది అద్భుతమైన సినిమా మూవీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు నేచురల్స్ స్టార్.
ఇప్పటి వరకు ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఇక ముందు ఎలా ఉంటుందో తెలయదు కాని ఇప్పటి వరకూ హిట్ టాక్ తో రన్ అవుతుంది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ నిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు చూసుకున్నాడు. కరోనా వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన హిందీ జెర్సీ.. లాంగ్ గ్యాప్ తరువత రిలీజ్ అయ్యింది.