
హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత(Jeevitha Rajashekar)పై జ్యో స్టార్ నిర్మాణ సంస్థ ఆర్ధిక ఆరోపణలు చేశారు. తమకు రావలసిన రూ. 26 కోట్లు రూపాయలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు వెల్లడించారు. గరుడ వేగ సినిమాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు వాపోతున్నారు.
2017లో రాజశేఖర్ హీరోగా గరుడవేగ (Garudavega) చిత్రం విడుదలైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెరకెక్కించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం జ్యో స్టార్ సంస్థ యజమాలు తమ ఆస్తులు అమ్మి డబ్బులు సమకూర్చారట. చివరకు తమకు రావలసిన డబ్బులు జీవితా రాజశేఖర్ చెల్లించలేదనేది వారి ప్రధాన ఆరోపణ. తమ ఆస్తులు బినామీ పేర్లకు మళ్లించి రాజశేఖర్, జీవితా దంపతులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదు. కొన్నాళ్లుగా జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది. ఈ కేసులో రాజశేఖర్ (Rajashekar) జైలు వెళ్లడం ఖాయమని జ్యో స్టార్ సంస్థ మీడియాకు తెలియజేశారు.
గురుడవేగ చిత్రాన్ని జీవితా రాజశేఖర్ కుటుంబం స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాలు లాభాలు గడించినట్లు సమాచారం ఉంది. మరి సినిమా నిర్మాణానికి నిధులు సమకూర్చిన జ్యో స్టార్ సంస్థకు (Jyo star enterprises) చెల్లించాల్సిన మొత్తం జీవితా రాజశేఖర్ దంపతులు చెల్లించలేదట. చిత్తూరు జిల్లా నగరిలో వీరిపై కేసు నమోదైనట్లు సమాచారం.