Pooja Hegde Wishes : మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పూజా హెగ్దే.. స్త్రీ గొప్పతనాన్ని తెలియజేస్తూ..

Published : Mar 08, 2022, 12:00 PM ISTUpdated : Mar 08, 2022, 12:05 PM IST
Pooja Hegde Wishes : మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన  పూజా హెగ్దే.. స్త్రీ గొప్పతనాన్ని తెలియజేస్తూ..

సారాంశం

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. స్త్రీ గొప్పతనాన్ని తెలియజేస్తూ వీడియోను షేర్ చేసింది.   

మహిళలకు ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాలని, వారినీ అన్నింటా సమద్రుష్టితో చూడాలని, అలాగే స్త్రీ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఏడాది మార్చి 8న  ఇంటర్నేషనల్ విమెన్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు చైతన్యవంతులు అవుతున్నారు. అన్ని రంగాల్లోనూ వారికి ఉద్యోగవకాశాలతో పాటు.. ప్రత్యేక గౌరవం కూడా దక్కుతోంది. భారతదేశ చరిత్రలోనూ చాలా మంది వీరనారీమణులు తామేమీ తక్కువ కాదని  నిరూపించుకున్నారు. అదే తరహాలో ప్రస్తుతం కూడా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఉన్నత లక్ష్యాలను చేధిస్తున్నారు. ఈ క్రమంలో సినీ రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. హీరోయిన్లుగా, ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్ గా, డైరెక్టర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 

అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్దే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూజా మాట్లాడుతూ.. ‘మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో మహిళల పాత్ర చాలా కీలకమైనది. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో పాత్రలు పోషిస్తోంది. నా జీవితంలో నేను చూశాను. మా అమ్మ.. తన భర్తను, పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఇదంతా ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఇంత గొప్ప పాత్ర పోషిస్తున్న మహిళలకు నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా తమ చుట్టూ ఉన్న మహిళలను గౌరవించాలని కోరుతున్నాను.’ అని పేర్కొంది.

 

పూజా హెగ్దే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘రాధే శ్యామ్’ మూవీలో నటించింది. ఈ చిత్రానికి రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరక్కెక్కించిన పిరియాడిక్ లవ్ స్టోరీ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి
ఆరేళ్ల పాటు సహజీవనం చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాక నిశ్చితార్థం చేసుకున్న నటుడు