సడెన్ ట్విస్ట్..క్రేజీ పాన్ ఇండియా డైరెక్టర్ తో రవితేజ మూవీ ?

By tirumala AN  |  First Published Aug 22, 2024, 10:05 PM IST

మాస్ మహారాజ్ రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. రవితేజ తన మార్కెట్ ని కోల్పోక ముందే మేల్కొని మంచి హిట్ డెలివర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు


మాస్ మహారాజ్ రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. రవితేజ తన మార్కెట్ ని కోల్పోక ముందే మేల్కొని మంచి హిట్ డెలివర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రీసెంట్ గా రవితేజ కి మిస్టర్ బచ్చన్ రూపంలో ఫ్లాప్ ఎదురైంది. హరీష్ శంకర్ తప్పకుండా హిట్ ఇస్తాడని అనుకుంటే చేతులెత్తేశాడు. 

దీనితో రవితేజ హిట్ కోసం మరో డైరెక్టర్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రవితేజ కోహినూర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఒక ఊహించని కాంబినేషన్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య తనయుడు మోక్షజ్ఞని లాంచ్ చేయబోతున్నాడు అంటూ ప్రశాంత్ వర్మ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

Latest Videos

హను మాన్ చిత్రంతో రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు. బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని ప్రయత్నించినా అది కుదర్లేదు. రణ్వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ హను మాన్ చిత్రం తర్వాత మూవీ చేయాలనీ సంప్రదింపులు జరిపారు. కానీ అది వర్కౌట్ కాలేదు. 

ఇప్పుడు ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ హీరోగా భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఇలా లాంచ్ కావడమే మిగిలింది అని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో మరో గాసిప్ వినిపిస్తోంది.ప్రశాంత్ వర్మ రీసెంట్ గా రెండు సార్లు రవితేజని కలిశారట. పురాణాలతో టచ్ ఉన్న ఒక ఫాంటసీ కథని ప్రశాంత్ వర్మ రవితేజకి వినిపించినట్లు తెలుస్తోంది. మరి రవితేజ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ? ఒక వేళ ఈ ప్రాజెక్టు సెట్ అయితే ఎప్పుడు మొదలవుతుంది లాంటి అంశాలన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్. 

click me!