చిరంజీవితో ఐదో సినిమా.. శుభవార్త చెప్పిన నిర్మాత 

By tirumala AN  |  First Published Aug 22, 2024, 9:23 PM IST

మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం వీరి కాంబినేషన్ లోనే వచ్చింది.


మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం వీరి కాంబినేషన్ లోనే వచ్చింది. ఆ చిత్రం ప్రతి అంశంలోనూ టాలీవుడ్ టాప్ మూవీస్ లో ఒకటిగా ఉంటుంది. 

ఆ తర్వాత చిరు అశ్విని దత్ కాంబోలో చూడాలని వుంది చిత్రం వచ్చింది. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకుడు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన ఇంద్ర చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో బి గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం తిరుగులేని రికార్డులు సాధించింది. 

Latest Videos

చిరంజీవి బర్త్ డే సందర్భంగా 22 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ మూవీ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. చిరు, అశ్విని దత్ కాంబినేషన్ లో వచ్చిన జై చిరంజీవా చిత్రం మాత్రం ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేక నిరాశ పరిచింది. 

ఇంద్ర రీరిలీజ్ సందర్భంగా అశ్విని దత్ గుడ్ న్యూస్ చెప్పారు. చిరంజీవితో తప్పకుండా ఐదో చిత్రం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సరైన దర్శకుడు, కథ దొరికితే వెంటనే చిరుతో సినిమా ఉంటుందని చెప్పారు. అశ్విని దత్, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కి కూడా భరోసా ఉంటుంది. 

click me!