రవితేజ మామూలు `ఖిలాడి` కాదుగా!

Published : Aug 10, 2020, 11:59 AM IST
రవితేజ మామూలు `ఖిలాడి`  కాదుగా!

సారాంశం

తెలుగులో ఖిలాడి అంటే ఇప్పటి వరకు అయితే ఎవరూ లేరు. ఇకపై మాత్రం రవితేజని ఆ పేరుతో పిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన నటించబోతున్న సినిమాకి `ఖిలాడి` అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట.

`ఖిలాడి` అంటే.. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ గుర్తొస్తాడు. ఎందుకంటే కెరీర్‌ ప్రారంభంలోనే ఆయన `ఖిలాడి` పేరుతో సినిమా ఫ్రాంఛైజీనే ప్రారంభించాడు. ఆ ఫ్రాంఛైజీలో ఏకంగా ఏడు సినిమాలు చేశాడు. దీంతో బాలీవుడ్‌ ఖిలాడి అంటే అక్షయ్‌ కుమారే గుర్తొచ్చేంతగా ఆయన ఆయా చిత్రాలతో మెస్మరైజ్‌ చేశాడు. 

మరి తెలుగులో ఖిలాడి అంటే ఇప్పటి వరకు అయితే ఎవరూ లేరు. ఇకపై మాత్రం రవితేజని ఆ పేరుతో పిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన నటించబోతున్న సినిమాకి `ఖిలాడి` అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో `క్రాక్‌` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు రమేష్‌ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. గతంలో రమేష్‌ వర్మ దర్శకత్వంలో `వీర` చిత్రంలో రవితేజ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పరాజయం చెందింది. ఇటీవల `రాక్షసుడు`తో రమేష్‌ వర్మ హిట్‌ అందుకున్నాడు. దీంతో రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. 

వీరి కాంబినేషన్‌లో రాబోతున్నసినిమాకి `ఖిలాడి` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌ టాక్. ఇందులో ఆయన పాత్ర, మ్యానరిజం `ఖిలాడి` లాగా ఉంటాయని, పైగా రవితేజ రియల్‌గానూ అదే స్టయిల్‌లో ఉండటంతో ఈ టైటిల్‌ పర్‌ఫెక్ట్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే రవితేజ మార్క్ మాస్‌ ఎలిమెంట్స్ ఈ సినిమాకి మరో ఆకర్షణగా నిలవనున్నాయట. ఇదే నిజమైతే.. ఈ సినిమా వర్కౌట్‌ అయితే కచ్చితంగా రవితేజ టాలీవుడ్‌ ఖిలాడి అవుతాడనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందని, రాశీఖన్నా, నిధి అగర్వాల్‌లను ఎంపిక చేశారని టాక్‌. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న `క్రాక్‌` చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. యాక్షన్‌ మేళవించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రమిది. రిలీజ్‌ కోసం వెయిటింగ్‌లో ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి