వైరల్‌ పోస్ట్‌: రానా భార్యకు సమంత వెల్‌ కం

Satish Reddy   | others
Published : Aug 10, 2020, 11:52 AM ISTUpdated : Aug 10, 2020, 11:55 AM IST
వైరల్‌ పోస్ట్‌: రానా భార్యకు సమంత వెల్‌ కం

సారాంశం

సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని బాగా ఆకర్షిస్తుంది. రానా - మిహికా బజాజ్ ల పెళ్లి ఫోటో పంచుకున్న సమంత నవ వధువుకి ఆహ్వానం పలికింది. అందమైన మిహికా మా కుటుంబంలోకి స్వాగతం అని సమంత పోస్ట్ చేశారు. సమంత పోస్ట్ పై నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 
రానా మెహిందీ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. షెల్ డిటైలింగ్ కలిగిన ఆ ఎల్లో డిజైనర్ వేర్ ధర అక్షరాలా  రూ. 1.59 లక్షలట. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన సమంత డ్రెస్ ధర గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఇక పెళ్ళిలో ఆమె శారీలో దర్శనమిచ్చారు. కాగా రానా-మిహికా పెళ్ళిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దిగిన ఫోటో సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఆ గ్రూప్ ఫోటో షేర్ చేసిన సమంత, కొత్త పెళ్లి కూతురుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 
'అందమైన మిహికా...కుటుంబంలోకి నీకు స్వాగతం' అని కామెంట్ పెట్టారు. నవ వధువు మిహికాకు సమంత మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకడం పట్ల నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమంత గ్రేట్ అంటూ ఆ ఫోటోకి లైక్స్ కొడుతూ, కామెంట్స్ పెడుతూ తమ అభిమానం చాటుకుంటున్నారు. సంధర్భానికి  తగ్గట్టుగా స్పందించిన సమంత అందరి మనసులు గెలుచుకుంటుంది.  అలాగే ఆమె కూడా దగ్గుబాటి ఫ్యామిలీలో ఒక భాగంగా భావిస్తుందని అర్థంఅవుతుంది . 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?