5 సెకండ్ల సీన్ కోసం.. 5 కోట్లు ఖర్చు చేసిన దర్శకుడు ఎవరు....?

By Mahesh Jujjuri  |  First Published Aug 23, 2024, 5:27 PM IST

ఈమధ్య సినిమాల కోసం కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు. చిన్న సీన్ కోసం కోట్లుధారపోసేవారు కూడా ఉన్నారు. అలాంటి సీన్ గురించే ఇప్పుడు చూద్దాం..
 


చిన్న సినిమాలు రెండు మూడు కోట్లతో తీసేవి కూడా చాలా ఉన్నాయి. ఆ సినిమాలు భారీ విజయాలు సాధించి రికార్డ్ లు సృష్టిస్తుంటాయి. కాని వేల కోట్లు పెట్టి తీసిన పెద్ద సినిమాలు డిజాస్టర్లుగా నిలిచినవి కూడా ఉన్నాయి. అయితే పెద్ద సినిమాల కోసం వేల కోట్ల బడ్జెట్ పెడితే.. ఆసినిమాల్లో సెకండ్ల సీన్ కోసం కోట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిసినిమాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు భారతీయుడు 2 సినిమాను. 

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా కోసం 200 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. కాని అది 500 కోట్లకు చేరినట్టు తెలుస్తోంది.  అయితే శంకర్ సినిమాలకు ఎలా ఖర్చుపెడతాడో అందరికి తెలిసిందే. జీన్స్ సినిమాలో ఓ పాట కోసం 7 వండర్స్ ను చుట్టించి తీసుకువచకచాడు. ఇలా బడ్డెట్ విషయంలోకాంప్రమైజ్ అవ్వని శంకర్ .. భారతీయుడు 2 సినిమా కోసం కూడా ఇలాంటి కాస్ట్లీ సాహసమే చేశాడట. అదేంటంటే..? 

Latest Videos

ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా రూ.5 కోట్లకుపైగానే నిర్మాతతో ఖర్చు చేయించాడు.అయితే అదేం అర్ధగంట.. గంట సీన్ కాదు.. కనీసం ఐదు నిమిషాల సీన్ కూడా కాదు.. 5 సెకండ్ల సీన్ కోసం.. 5 కోట్లకు పైనే ఖర్చు పెట్టించాడట శంకర్. అది ఏ సీన్ అంటే...ఎస్‌.జే సూర్య ఉండే ఇల్లు సీన్.  ఈసీన్ లో ఉండే ఇల్లు 5 సెకండ్ల లోపే కనిపిస్తుంది. దీని కోసం ఈ ఇంటిని  ప్రత్యేకంగా తీర్చిదిద్దారట. ఇందు కోసం ఏకంగా 5 నుంచి 8 కోట్ల వరకూ ఖర్చు చేశారని టాక్. 

మరి ఇంత ఖర్చు చేసి.. అంత తక్కువగా ఎందుకు చూపించారంటే.. భారతీయుడు సినిమాకు మరోసీక్వెల్ ఉంటుంది. భారతీయుడు3 గా రాబోతున్న ఆ సినిమాలో ఈ ఇంటికి సబంధించి పూర్తి సీన్స్ ఉంటాయి అని అంటున్నారు మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ ఇల్లు మాత్రం అన్నికోట్లు ఖర్చు పెట్టి.. కనీసం నిమిషాల వ్వవధిలో కూడా చూపించకపోవడం ఆశ్చర్యం కదా..? అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ మ్యాటర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. 

ఇక ఈ సినిమా చాలా ధారుణంగాప్లాప్ అయ్యింది. ఇంత కష్టపడి.. ఇన్ని కోట్లు పెట్టి తీసినందుకు మంచి రెస్పాన్స్ వచ్చిందా అంటే.. డిజాస్టర్ టాక్ తో నడిచింది. అంతే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌లకు వెళ్లిన ఆడియెన్స్… ఇంటర్వెల్‌లోనే బయటకు వచ్చేశారంటే శంకర్ ఎంత దారుణంగా సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. 

ఈ సినిమాకు తెలుగులో రూ. 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.12 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. కట్ చేస్తే… ఫైనల్ రన్‌లో అందులో సగం షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ లెక్కన సెట్‌కు పెట్టిన కలెక్షన్లు కూడా రాలేదు. భారతీయుడు 2, 3 పార్టులకు కలిపి ముందుగా అనుకున్న బడ్జెట్ రూ.200 కోట్లు. కానీ ఫైనల్‌గా రూ.500 కోట్లు అయింది. థియేట్రికల్ కలెక్షన్లతో పాటు.. అన్ని హక్కులు కలిపినా… నిర్మాతకు కేవలం రూ.150 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన నిర్మాతకు వందల కోట్లు నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. 

click me!