టీం మెంబర్స్. రిలీజ్ కేవలం మరో పదిహేను రోజులు మాత్రమే ఉన్నా ఈ సినిమాకు ఇంకా బిజినెస్ జరగలేదని అంటున్నారు.
ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ బిజనెస్ అనేది అంతకు ముందు ఆ హీరోకు వచ్చిన హిట్, ప్లాఫ్ ని బట్టి ఉంటుంది. అదే సమయంలో ఆ చిత్రం ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి కూడా అంచనా వేస్తారు. ఆదిపురుష్ ప్లాఫ్ అని సలార్ కు బిజినెస్ తక్కువ జరగదు. బీస్ట్ బాగోలేదని, లియోని చూడటం మానరు. కాకపోతే కాస్త అటూ ఇటూగా బేరసారాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం ఈగల్ కు కూడా బయ్యర్ల విషయంలో ఇబ్బంది ఎదురౌతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఈగల్ సినిమాకు బయ్యర్ల పరంగా సమస్య వస్తోందంటూ ఓ ఆగ్ల దినపత్రిక కథనం రాసుకొచ్చింది.
రవితేజ (Ravi Teja)నుంచి వస్తున్న తాజా చిత్రం ఈగల్ (Eagle).ఈ సినిమాని సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ , కావ్య థాపర్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్‌డేట్ అందిస్తున్నారు టీం మెంబర్స్. రిలీజ్ కేవలం మరో పదిహేను రోజులు మాత్రమే ఉన్నా ఈ సినిమాకు ఇంకా బిజినెస్ జరగలేదని అంటున్నారు.
undefined
రవితేజ గత చిత్రాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయటంలో ఫెయిల్ అయ్యాయి. ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు తెచ్పి పెట్టాయి. దాంతో రవితేజ కొత్త చిత్రం అంటే వెనకడుగు వేస్తున్నారు అంటున్నారు. దాంతో నిర్మాతలు ఈగల్ బిజినెస్ క్లోజ్ చేయలేదని, నెగోషియేషన్స్ జరుపుతున్నట్లు చెప్తున్నారు. ఇదే బ్యానర్ లో గతంలో రవితేజ తో ధమాకా వంటి సూపర్ హిట్ వచ్చింది. మరో ప్రక్క ఈగల్ హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేయలేదని చెప్తున్నారు. కానీ రవితేజకు ఇలా జరగటం కొత్తేమీ కాదు. వరస ఫెయిల్యూర్స్ నుంచి బయిటకు వచ్చి హిట్స్ కొట్టాడు. అంతెందుకు 2023 ప్రారంభంలో వాల్తేరు వీరయ్యలో అదరకొట్టాడు.
ఈగల్‌లో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈగల్ పోస్టర్లు, స్టైలిష్ లుక్, ట్రైలర్ అప్‌డేట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ ట్రైలర్‌లో మాస్ మహారాజా రవితేజ స్టైల్‌లో సాగుతున్న మార్క్ డైలాగ్స్ అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.