రవీనా టాండన్ తాగి లేదు, అది తప్పుడు కేసు

Published : Jun 03, 2024, 11:43 AM IST
రవీనా టాండన్ తాగి లేదు, అది తప్పుడు కేసు

సారాంశం

మేము సొసైటీలోని మొత్తం CCTV ఫుటేజీని తనిఖీ చేసాము . అలాగే ఈ కుటుంబం అదే లేన్‌ను దాటుతున్నప్పుడు రవీనా డ్రైవర్ కారును రోడ్డు నుండి సొసైటీలోకి రివర్స్ చేస్తున్నాడని అర్దమైంది.  


నటి రవీనా టాండన్‌పై  తాగి, ర్యాష్ డ్రైవింగ్ మరియు దాడికి పాల్పడినట్లు  తప్పుడు ఫిర్యాదు చేశారని ముంబై పోలీసులు  స్పష్టం చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు తప్పుడు ఫిర్యాదు చేశారని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత రవీనా కారు ఎవరినీ ఢీకొట్టలేదని, ఆమె తాగి లేదని తేలిందని తేల్చి చెప్పారు. ముంబైకి చెందిన ఒక దినపత్రికతో మాట్లాడుతూ,  డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) ఈ విషయం చెప్పుకొచ్చారు.

"ఫిర్యాదుదారుడు ఆరోపించిన వీడియోలో తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. మేము సొసైటీలోని మొత్తం CCTV ఫుటేజీని తనిఖీ చేసాము . అలాగే ఈ కుటుంబం అదే లేన్‌ను దాటుతున్నప్పుడు రవీనా డ్రైవర్ కారును రోడ్డు నుండి సొసైటీలోకి రివర్స్ చేస్తున్నాడని అర్దమైంది.  అప్పుడు ఆ కుటుంబం ఆగిపోయింది. కారు రివర్స్ చేయడానికి ముందు కారు వెనుక వ్యక్తులు ఉన్నారో లేదో తనిఖీ చేయాలని డ్రైవర్‌కు చెప్పారు. అప్పుడే  వారి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది, ”అని డిసిపి దినపత్రికతో మాట్లాడుతూ చెప్పారు.

గొడవ పెద్దదై వాగ్వాదం వేడెక్కడంతో, రవీనా ఏం జరిగిందో తెలుసుకోవటానికి కారు దిగి సంఘటన స్థలానికి వచ్చింది. తమ డ్రైవర్ ని చుట్టుముట్ిటన గుంపు నుండి అతన్ని రక్షించడానికి ప్రయత్నించింది.  ఆ క్రమంలో ఇరువైపు వాళ్లు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు చేయడానికి వెళ్లారు, కాని తరువాత వాటిని ఉపసంహరించుకున్నారు.

"ఈ వాదన తిట్లకు దారితీసింది, నటి రవీనా టాండన్ తన డ్రైవర్‌తో ఏమి జరిగిందో చూడటానికి సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆమె  ఆ గుంపు నుండి డ్రైవర్‌ను రక్షించడానికి ప్రయత్నించింది. అయినా ఆ గుంపు ఆమెను దుర్భాషలాడడం ప్రారంభించింది.  , ”అని డిసిపి రాజ్‌తిలక్ రోషన్ వివరించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, కారు ఎవరినీ ఢీకొట్టలేదని, రవీనా మద్యం మత్తులో లేదని డీసీపీ రాజ్‌తిలక్ రోషన్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్