‘మీర్జాపూర్’ సీజన్ 3 రిలీజ్ డేట్

Published : Jun 03, 2024, 08:46 AM IST
‘మీర్జాపూర్’ సీజన్ 3  రిలీజ్ డేట్

సారాంశం

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూడో భాగం  అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. 


మన తెలుగులోనూ మీర్జాపూర్ కి ఓ రేంజిలో ఫ్యాన్స్ ఉన్నారు.  దాంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించింది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు మంచి ఆదరణ అందుకోవడంతో.. మూడోదాని కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన మూడో భాగం  అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ క్రమంలో ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభమయ్యేదనే డేట్ బయిటకు వచ్చింది.

ముంబై మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సీరిస్ ..జూలై 9, 2024 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  ఏడాది క్రితమే దీని షూటింగ్‌ పూర్తయినట్లు నటీనటులు తెలిపారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకొన్న ఈ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది.

గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇదీ సూపర్‌ హిట్‌ అయ్యింది. 

తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించారు. రెండో సీజన్లో మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. దీంతో మూడో దానిపై ఆసక్తి నెలకొంది. ఇందులో విజయ్ వర్మ కీలకపాత్రలో కనిపించనున్నారు. మున్నా భయ్యాను గుడ్డు చంపేయయం.. కలీన్ భయ్యా, శరద్ చేతులు కలపడంతో మీర్జాపూర్ రెండో సీజన్ ముగిసింది. దీంతో మీర్జాపూర్‌ కోసం ఆధిపత్యం పోరులో పరిస్థితులు మారిపోయాయి. మూడో సీజన్‍లో కుర్చీ కోసం కుట్రలు, కుతంత్రాలు మరింత రంజుగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‍లో కొన్ని సర్‌ప్రైజ్ ట్విస్టులు కూడా ఉంటాయి.
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్