‘రావణసుర’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్.. కొత్త పోస్టర్ లో దుమ్ములేచిపోయిన రవితేజ లుక్!

By Asianet News  |  First Published Feb 13, 2023, 4:45 PM IST

స్టార్ హీరో రవితేజ (RaviTeja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణసుర’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. 
 


టాలీవుడ్ సీనియర్ నటుడు, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘రావణసుర’ కాస్తా డిఫరెంట్ లుక్, కొత్తదనంతో కనిపించబోతున్నారు రవితేజ. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని  పెంచుతున్నాయి. మరోవైపు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రవితేజ దుమ్ములేపుతుండటంతో నెక్ట్స్ రిలీజ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ కూడా అదే  స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకుగానూ వరుసగా ఏదోక అప్డేట్ అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. 

ఇప్పటికే చిత్రం నుంచి ‘రావణాసుర అంథెమ్’ విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మరో సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ సందర్భంగా క్రేజీ అప్డేట్ ను అందించారు. తదుపరి అప్డేట్ లో హై ఎనర్జీతో కూడా  సాంగ్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 18న ‘ప్యార్ లోన పాగల్’ (Pyaarlona paagal) సాంగ్ ను విడుదల  చేయనున్నట్టు డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన కొత్త పోస్టర్ దుమ్ములేచిపోయింది. బ్లాక్ సూట్ లో మాస్ మహారాజ ఆకట్టుకుంటున్నారు. ఈచిత్రంలో మరింత జోష్ ను కనబర్చినట్టు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో.. ‘రావణాసుర’ వస్తుండటంతో అంచనాలు హైలో ఉన్నాయి. చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్టీ టీమ్ వర్క్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చిత్రంలో సుశాంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజితా పొన్నాడ ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 2023 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల విడేదల కాబోతోందీ చిత్రం. మరోవైపు రవితేజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే ‘కార్తీక్ ఘట్టమనేని’తోనూ ఓ సినిమా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 

After a reverberating Anthem🔥

Get ready to ignite the dance floor with Mass Maharaja's high-energy song❤️‍🔥🕺 Lyric Video on Feb 18th🎶 pic.twitter.com/kUF4CLHrQD

— RT Team Works (@RTTeamWorks)
click me!