
ఈ మధ్యకాలంలో విడుదలైన అన్ని సినిమాల్లో రిపీట్ ఆడియన్స్ తో మంచి కలెక్షన్స్ అందించిన సినిమాల్లో 'సీతారామం' ఒకటి.ఈ సినిమాలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ రోజు ఓ మోస్తారు ఓపెనింగ్ తెచ్చుకున్న రోజు రోజు కి పబ్లిక్ టాక్ తో వేగంగా దూసుకెళ్ళింది. చిన్న గా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.ఇకపోతే ఈ సినిమా తెలుగు .. తమిళ్ ఆడియన్స్ అందరికీ తెగ నచ్చేసింది. దాంతో ఈ దర్శకుడు తదుపరి ఏ చిత్రం చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు... ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నానితో చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ట్విట్టర్ ఫ్రొఫైల్ పిక్చర్ మార్చగానే చాలా మందికి హింట్ ఇచ్చినట్లు అయ్యింది. ఆ ప్రొఫైల్ పిక్చర్ ఏమిటో ..ఆ ట్వీట్ ఏమిటో మీరే చూడండి. నానీ, హను రాఘవపూడి కాంబినేషన్ లో గతంలో కృష్ణగాడి వీర ప్రేమ గాధ అనే చిత్రం వచ్చి విజయం సాధించింది.
ఇక ఆ మధ్యన ఓ స్టోరీని తమిళ సూపర్ స్టార్ సూర్యకు వివరించినట్లు తెలిసింది. సూర్యకు ఈ కథ బాగా నచ్చింది కానీ ఇందులో మరో స్టార్ హీరో క్యారెక్టర్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నట్లుగా వినపడింది. ఈ స్పెషల్ రోల్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాగుంటాడని భావిస్తున్న సూర్య.. ఒకసారి చరణ్‌ను కలవాల్సిందిగా హను రాఘవపూడికి సూచించాడని వార్తలు వచ్చాయి.
వాస్తవానికి హను రాఘవపూడి కూడా రాంచరణ్‌తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ వర్కవుట్ కాలేదు. ఒకవేళ హను చెప్పిన కథ నచ్చి, సూర్య సినిమాలో తాను గెస్ట్ రోల్‌లో నటించేదుకు అంగీకరిస్తే మాత్రం అది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుంది. ఈ న్యూస్ విన్న అభిమానులు సైతం ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కావాలని ఆశపడ్డారు.