Rathika Eliminate: బిగ్‌ బాస్‌ లీక్.. రతిక ఎలిమినేట్‌.. డబుల్‌ ఎలిమినేషన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఔట్‌?

Published : Nov 25, 2023, 07:18 PM IST
Rathika Eliminate: బిగ్‌ బాస్‌ లీక్.. రతిక ఎలిమినేట్‌.. డబుల్‌ ఎలిమినేషన్‌లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఔట్‌?

సారాంశం

తాజాగా బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్లు లీక్‌ అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ వారం ఇద్దరు లేడీ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడుతున్నట్టు తెలుస్తుంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో గత వారం ఎలిమినేషన్‌ లేదు. గౌతమ్‌, అశ్వినిలను కాపాడాడు బిగ్‌బాస్. అయితే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌కి కట్టుబడి ఉన్నారట. ప్రస్తుతం నామినేషన్‌లో శివాజీ, ప్రశాంత్‌, యావర్‌, అర్జున్‌, రతిక, అశ్విని, గౌతమ్‌, అమర్‌దీప్‌ లు ఉన్నారు. వీరిలో ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే చాలా వరకు అశ్విని, రతిక, గౌతమ్‌లు ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉన్నారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్లు లీక్‌ అయ్యాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ వారం ఇద్దరు లేడీ కంటెస్టెంట్‌ హౌజ్‌ని వీడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ జరుగుతుందట. డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు వెళ్లిపోతున్నట్టు తెలుస్తుంది. శనివారం ఎపిసోడ్‌లో అశ్వినిని ఎలిమినేట్‌ చేస్తున్నట్టు సమాచారం. డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగం మరో ఎలిమినేషన్‌ ఉంది. అయితే రెండో కంటెస్టెంట్‌గా రతిక ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్‌లో రతిక ఎలిమినేట్‌ ఉంటుందట. 

ఈ ఇద్దరి ఆట తీరు ప్రారంభం నుంచి డల్‌గా ఉంది. భోలే, తేజల కంటే ఈ ఇద్దరిని పంపించినా బాగుండేదనే అభిప్రాయం వినిపించింది. తాజాగా ఆ పని చేశాడు బిగ్‌ బాస్‌. 12వ వారంలో ఈ ఇద్దరిని హౌజ్‌ నుంచి ఇంటికి పంపించినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే రతిక ఇప్పటికే ఓ సారి ఎలిమినేట్‌ అయ్యింది. కానీ ఆమె బ్రతిమాలుకుని, హౌజ్‌లో కంటెస్టెంట్లో ఓటింగ్‌ని బేస్‌ చేసుకుని మళ్లీ తీసుకొచ్చారు. మొదట్లోనే ఆమె ఆట తీరు, ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. మళ్లీ రీ ఎంట్రీ తర్వాత కూడా ఆమె ఆటతీరులో పెద్దగా మార్పు లేదు. అయినా నాగార్జున, ఇతర కంటెస్టెంట్లు కూడా ఆమె ఆడటం లేదని చెబుతూనే వస్తున్నారు, కొంత టైమ్‌ ఇవ్వండి అంటూ ఆమె వేడుకుంటుంది. అలా సేవ్ అవుతూ వచ్చిన ఆమె ఇప్పుడు 12వ వారంలో హౌజ్‌ని వీడుతున్నట్టు తెలుస్తుంది. 

ఇక అశ్విని కూడా వైల్డ్ కార్డ్ ద్వారానే హౌజ్‌లోకి వచ్చింది. ఆమె ప్రారంభంలో కొంత బాగానే అనిపించినా, ఆ తర్వాత డల్ అయ్యింది. ఇతర కంటెస్టెంట్లని ఎదుర్కోవడంలో ఆమె డీలా పడింది. కానీ మొత్తానికి నెట్టుకుంటూ వచ్చింది. అయితే ఈ వారం ఆమెని ఎవరూ నామినేట్‌ చేయలేదు. ఇతరులను నామినేట్‌ చేయడం ఇష్టం లేక తనని తానే నామినేట్‌ చేసుకుంది. ఫలితంగా ఆమెనే బలయ్యింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే