జర్నలిస్ట్ పాత్రలో రష్మిక మందన్నా.. పాన్‌ ఇండియా సినిమాలో?

By Surya Prakash  |  First Published Apr 16, 2021, 7:58 PM IST

అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప తో  రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో పెద్ద హీరో సినిమా అంటే.. పూజ హెగ్డే లేదంటే  రష్మిక ఉండాల్సిందే అనే స్టేజ్  లోకి రష్మిక వచ్చేసింది.
 


తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరూ అంటే ఇప్పుడు రష్మిక.. పేరే చెప్తున్నారు. ఏ హీరో నోట విన్నా, ఏ బడా ప్రొడ్యూసర్ అయినా ఈమెనే కలవరిస్తున్నారు. లక్కీ హీరోయిన్ గా అతి తక్కువ టైం లో స్టార్ డం సంపాదించుకున్న రష్మిక ఇప్పుడు వరస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. ఓ ప్రక్క అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప తో  రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. దాంతో పెద్ద హీరో సినిమా అంటే.. పూజ హెగ్డే లేదంటే  రష్మిక ఉండాల్సిందే అనే స్టేజ్  లోకి రష్మిక వచ్చేసింది.

 తెలుగులో శర్వానంద్ తో ఆడాళ్ళు మీకు జొహార్లు మూవీలో నటిస్తున్న రష్మికకి శంకర్ – రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ తగిలింది అని సమాచారం. ఈ ప్రాజెక్టులో , ముందు కియారా అద్వానీని అనుకున్నా.. ఇప్పుడు ఆమెని కొరటాల శివ ఎన్టీఆర్ కోసం లాక్ చెయ్యడంతో.. రామ్ చరణ్ సరసన ఫ్రెష్ గా రష్మిక అయితే బావుంటుంది అని దర్శకుడు శంకర్ లాక్ చేసారట. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్ర చేయబోతోందిట.

Latest Videos

‘జెంటిల్‌మెన్‌’ ‘భారతీయుడు’ ‘అపరిచితుడు’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్‌. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ  చిత్రం శంకర్‌కు 15వ సినిమా,  అలాగే రామ్‌చరణ్‌కు కూడా ఇది 15వ చిత్రమవడం విశేషం. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ - రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. 

దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ  సంస్థకు 50వ చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్‌  ప్లాన్ చేస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి.  రష్మిక దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న ’మిషన్‌ మజ్ను’ అనే చిత్రంలో నటిస్తోంది. రష్మిక చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు,డేట్స్ ఎడ్జెస్ట్ చేసేందుకు ఒప్పుకుందని సినీవర్గాల సమాచారం.  

click me!