పవన్‌కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్.. వైరస్‌‌ వ్యాప్తికి `వకీల్‌సాబ్‌` ఈవెంట్‌ వేదికైందా?

Published : Apr 16, 2021, 05:59 PM ISTUpdated : Apr 16, 2021, 08:34 PM IST
పవన్‌కి కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్.. వైరస్‌‌ వ్యాప్తికి `వకీల్‌సాబ్‌` ఈవెంట్‌ వేదికైందా?

సారాంశం

పవన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ పడుతున్నారు.   

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి కరోనా సోకింది. రెండు రోజుల క్రితం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. అంతేకాదు ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌజ్‌లో వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటున్నారు. ఊపిరితిత్తులకు కాస్త నిమ్ము వచ్చిందని, దీంతో అవసరమైనప్పుడు ఆక్సీజన్‌ కూడా అందిస్తున్నట్టు జనసేన పార్టీ నుంచి ప్రకటన వెలువడింది. పవన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం ఎలా ఉంటుందో అనే టెన్షన్‌ పడుతున్నారు.  

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం తన ఆఫీస్‌ బృందానికి కరోనా సోకడంతో పవన్‌ ఐసోలేట్‌ అయిపోయారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆయనకు కరోనా అంటుకుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ మూడున తిరుపతి ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్నట్టు, ఆ తర్వాత నుంచే ఆయనకు ఆరోగ్యం కాస్త నలతగా ఉన్నట్టు తెలిపారు. దీంతో ఇప్పుడిది కొత్త అనుమానాలకు, కొత్త ఆందోళనలకు దారితీస్తుంది. ఆ ప్రచారం అనంతరం పవన్‌ తన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే చిత్ర బృందాన్ని కలిశాడు. ఆ తర్వాత ఆ సభలో పాల్గొన్న ఫ్రెండ్‌, నిర్మాత బండ్ల గణేష్‌ కి కరోనా సోకింది. ఆయన ప్రస్తుతం  ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. 

ఆయనతోపాటు `వకీల్‌సాబ్‌` ప్రొడ్యూసర్‌ దిల్‌రాజుకి కూడా కరోనా సోకింది. అంతకు ముందే నివేదా థామస్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్‌కి కరోనా తేలడంతో `వకీల్‌సాబ్‌` బృందం మరింతగా ఆందోళన చెందుతుంది. `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌లో ఆయన చాలా మందిని ప్రత్యక్షంగా కలిశారు. వేదికపై మాస్క్ కూడా తీసేశాడు. ఈ లెక్కన వైరస్‌ ఎంత మందికి సోకి ఉంటుందో అనే ఆందోళన స్టార్ట్ అయ్యింది. ఇతర చిత్ర బృందం, కళాకారులు, బ్యాండ్‌ స్పెషలిస్ట్ శివమణిని సైతం పవన్‌ కలిశాడు. ఇప్పుడు వీరంతా ఆందోళన చెందుతున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ మొత్తంగా చాలా మందికి కరోనా అంటించాడా? అనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆ ఈవెంట్‌లోనే ఇతరుల నుంచి ఆయనకు సోకిందా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇది అందరిని టెన్షన్‌ పెడుతుంది. పవన్‌ ఆరోగ్యంపై సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీ ప్రత్యక్షంగా ఆయన ఆరోగ్యంపై ఆరతీస్తున్నారట. వైద్యానికి కావాల్సినవి ఏర్పాట్లు చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్‌ త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కోరుతూ ట్వీట్లు చేస్తున్నారు. అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

మరోవైపు ఆయన రీఎంట్రీ ఇస్తూ నటించిన `వకీల్‌సాబ్‌` ఈ నెల 9న విడుదలై కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే అది వంద కోట్లు వసూలు చేసింది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దీంతోపాటు పవన్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `హరిహరవీరమల్లు` చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?