`అశోకవనంలో అర్జున కళ్యాణం` అంటోన్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌

Published : Apr 16, 2021, 07:27 PM IST
`అశోకవనంలో అర్జున కళ్యాణం` అంటోన్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌

సారాంశం

ప్రస్తుతం `పాగల్‌` చిత్రం చేస్తున్న విశ్వక్‌ సేన్‌ తాజాగా మరో కొత్త సినిమాని లాంచ్‌ చేశాడు. `అశోకవనంలో అర్జున కళ్యాణం` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ప్రారంభమైంది.

`ఫలక్‌నూమాదాస్‌` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. అన్ని తానై రూపొందించిన ఈ సినిమా సక్సెస్‌ సాధించడంతో క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత `హిట్‌` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు `పాగల్‌` మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. 

ఇదిలా ఉంటే మరో సినిమాని స్టార్ట్ చేశాడు విశ్వక్‌సేన్‌. `అశోకవనంలో అర్జున కళ్యాణం` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో ఆయన అర్జున్‌గా కనిపించబోతున్నారు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్‌ పతాకంపై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పకులుగా ఉండగా, బాపినీడు, సుధీర్‌ నిర్మిస్తున్నారు. దీనికి విద్యా సాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు మాస్‌ సినిమాలతో వచ్చిన విశ్వక్‌ సేన్‌ ఫస్ట్ టైమ్‌ క్లాసీ టైటిల్‌తో రాబోతుండటం విశేషం. ఈ చిత్రం ఆయనకి ఏడవది కావడం మరో విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

MSG Movie: మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఫ్లాప్ కాకుండా కాపాడింది ఎవరో తెలుసా ? చిరంజీవి, వెంకటేష్ కాదు
పెళ్ళికి ముందే స్టార్ హీరోకి పుట్టిన నటి, 40 ఏళ్ల సెన్సేషనల్ హీరోయిన్ ఎవరో తెలుసా?