ఆ వార్తలు నిజమైతే బాగుండు అంటున్న రష్మిక

Published : Feb 20, 2021, 10:47 PM IST
ఆ వార్తలు నిజమైతే బాగుండు అంటున్న రష్మిక

సారాంశం

హిందీలో కూడా ఆఫర్స్ పట్టేస్తున్న రష్మిక రెమ్యూనరేషన్ పై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సౌత్ ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. రష్మికను సినిమాలో పెట్టుకోవాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయంటూ వార్తలు రావడం జరిగింది.   

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు రష్మిక మందాన. అత్యధిక హిట్ పర్సెంటేజ్ తో లక్కీ హ్యాండ్ అన్న ఇమేజ్ కూడా తెచ్చుకున్నారు. గత ఏడాది రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ భారీ విజయాలు అందుకున్నాయి. సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇక పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నితిన్ ని భీష్మ హిట్ ట్రాక్ ఎక్కించింది. 

హిందీలో కూడా ఆఫర్స్ పట్టేస్తున్న రష్మిక రెమ్యూనరేషన్ పై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సౌత్ ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. రష్మికను సినిమాలో పెట్టుకోవాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయంటూ వార్తలు రావడం జరిగింది. 

ఈ నేపథ్యంలో సదరు వార్తలపై రష్మిక మందాన స్పందించారు. నిజంగా వారు రాసినట్లు నా రెమ్యూనరేషన్ అన్ని కోట్లు అయితే బాగుండు అని ఆమె సెటైర్ వేశారు. తన కోరిక కూడా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవాలని ఆమె అన్నారు. తెలుగులో పుష్ప మూవీలో రష్మిక నటిస్తుండగా, షూటింగ్ జరుపుకుంటుంది. ఇది తమిళంలో కార్తీకి జంటగా నటించిన సుల్తాన్ త్వరలో విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్