అప్పుడు మహేష్ పై క్లాప్ కొట్టి... ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాడు!

By team teluguFirst Published Feb 20, 2021, 9:25 PM IST
Highlights

బుచ్చి బాబు సానా మరియు మహేష్ బాబు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో మహేష్ పై బుచ్చి బాబు క్లాప్ కొడుతున్నాడు. బుచ్చి బాబు పరిశ్రమకు వచ్చినప్పటి నుండి దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. 


దర్శకుడు బుచ్చి బాబు సానా ఫేట్ ని ఒక్క సినిమా మార్చేసింది. ఉప్పెన చిత్రంతో అతని క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఉప్పెన రికార్డు వసూళ్లు సాధిస్తుంది. ఇక ఉప్పెన నిర్మాతలు బుచ్చి బాబుకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చి బాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీ తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్, బుచ్చి బాబుకు గతంలో మంచి స్నేహం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ సైతం సానుకూలంగా ఉన్నట్లు వినికిడి. 

కాగా బుచ్చి బాబు సానా మరియు మహేష్ బాబు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో మహేష్ పై బుచ్చి బాబు క్లాప్ కొడుతున్నాడు. బుచ్చి బాబు పరిశ్రమకు వచ్చినప్పటి నుండి దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. సుకుమార్ దగ్గర చదువు నేర్చుకున్న శిష్యులలో బుచ్చి బాబు ఒకరు కావడం విశేషం. దీనితో సుకుమార్ తెరకెక్కించిన వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలకు బుచ్చి బాబు పనిచేశారు.

 2014లో సుకుమార్-మహేష్ కాంబినేషన్ లో వన్ నేనొక్కడినే తెరకెక్కింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రం కమర్షియల్ గా అంతగా ఆడకపోయినా, సుకుమార్ టేకింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అసిస్టెంట్ అయిన బుచ్చి బాబు మహేష్ పై క్లాప్ కొట్టాడు. ఉప్పెన హిట్ తో బుచ్చి బాబు బాగా ఫేమస్ కాగా, అప్పటి అతని ఫోటో వైరల్ అవుతుంది.

click me!