సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది.. రష్మిక కామెంట్స్

pratap reddy   | Asianet News
Published : Sep 16, 2021, 09:26 AM IST
సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది.. రష్మిక కామెంట్స్

సారాంశం

కన్నడ బ్యూటీ రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులు ఆమెని నేషనల్ క్రష్ గా అభివర్ణిస్తున్నారు.

కన్నడ బ్యూటీ రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులు ఆమెని నేషనల్ క్రష్ గా అభివర్ణిస్తున్నారు. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. 

తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ బయోపిక్ లో నటించాల్సి వస్తే ఎవరి పాత్రలో నటిస్తారు అని ప్రశ్నించగా.. రష్మిక దివంగత నటి సౌందర్య పేరు చెప్పింది. సౌందర్యనే ఎంచుకోవడానికి కారణం ఉందని రష్మిక తెలిపింది. 

'నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న ఒక మాట అనేవారు.. నేను సౌందర్య గారిలా ఉంటానట. తరచుగా నాతో ఆ మాట అనేవారు. ఇక సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు ఇష్టం' అని రష్మిక ఇంటర్వ్యూలో తెలిపింది. అవకాశం వస్తే సౌందర్య బయోపిక్ లో నటిస్తానని రష్మిక పేర్కొంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటిస్తోంది. 

దివంగత నటి సౌందర్య ఒకప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులకు అభిమాన నటి. సౌత్ లో స్టార్ హీరోలందరితో ఆమె నటించారు. 2004లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?