నాగ చైతన్య స్ట్రిక్ట్ వార్నింగ్.. సమంత గురించి ప్రశ్నలు ?

By telugu teamFirst Published Sep 16, 2021, 7:46 AM IST
Highlights

అక్కినేని వారసుడు నాగ చైతన్య గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు. చైతు నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

అక్కినేని వారసుడు నాగ చైతన్య గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తల్లో నిలుస్తున్నాడు. చైతు నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. తన వ్యక్తిగత కారణాలతో కూడా చైతు వార్తల్లో నిలుస్తున్నాడు. సమంతతో చైతు వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉందంటూ కొంతకాలంగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ రూమర్స్ పై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ.. చైతు , సమంతల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. దీనితో చైతు, సామ్ విడిపోతున్నారు అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా చైతు నటించిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. 

ప్రమోషనల్ కార్యక్రమాల్లో చైతు మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. మీడియా సంధించే ప్రశ్నలతో అయినా చైతు, సామ్ రిలేషన్ షిప్ పై క్లారిటీ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ విషయంలో మీడియాకు చైతు స్ట్రిక్ట్ వార్నింగ్ పంపినట్లు తెలుస్తోంది. 

సమంత గురించి.. తమ రిలేషన్ షిప్ గురించి ఎలాంటి ప్రశ్నలు లేకుంటేనే తాను ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతానని చైతు నిర్మాతలు, పిఆర్ టీం ద్వారా మీడియాకు సందేశం పంపారట. తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి ప్రశ్నలు లేకుంటేనే లవ్ స్టోరీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని.. లేకుంటే లేదని చైతు తేల్చి చెప్పేశాడట. దీనితో నిర్మాతలు ఆ హామీ ఇచ్చిన తర్వాతే చైతు లవ్ స్టోరీ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

చైతు సోషల్ మీడియా వేదికగా లవ్ స్టోరీ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశాడు. లవ్ స్టోరీ ట్రైలర్ పై సమంత స్పందించింది. కానీ చైతు గురించి ఎలాంటి కామెంట్ పెట్టలేదు. 

సాయి పల్లవి , చైతు జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. కరోనా ప్రభావం వల్ల చాలా రోజులుగా ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. 

click me!