
రష్మిక మందన్నా నేషనల్ క్రష్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె అత్యంత వేగంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. వరుస విజయాలు ఆమెని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. కన్నడ నుంచి స్టార్ట్ చేసిన రష్మిక అట్నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి వెళ్లింది. `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఈ సినిమాలోని శ్రీవల్లి పాత్ర మాత్రం ఇండియా దాటి గ్లోబల్ వైడ్‌గా పాపులర్ కావడం విశేషం.
మరోవైపు కేవలం ఒక్క సినిమాతోనే క్రేజీ బ్యూటీగా మారింది శ్రీలీల. యంగ్ సెన్సేషన్‌గా పేరుతెచ్చుకుంది. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చింది. `ధమాఖా` మూవీతో ఈ బ్యూటీ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా హిట్ కావడంతో వరుసగా కుప్పలుకుప్పులుగా అవకావాలు వచ్చిపడుతున్నాయి. సుమారు పది సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. ఇంకా కొత్త అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వరించింది.
నితిన్‌తో మరో అవకాశాన్ని దక్కించుకుంది శ్రీలీల. ఇప్పటికే `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` చిత్రంలో నితిన్‌తో హీరోయిన్‌ఘా నటిస్తుంది శ్రీలీల. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా డిసెంబర్‌లో రాబోతుంది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ శ్రీలీలకి వరించింది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో శ్రీలీల ఎంపికైందట. మొదట ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓకే అయ్యింది. `భీష్మ` హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. కానీ అనూహ్యంగా సినిమా నుంచి రష్మిక తప్పుకుంది. అయితే దీనికి రష్మిక మేనేజర్ నిర్వాకం వల్లే జరిగిందని అంటున్నారు. ఆ స్థానంలో ఇప్పుడు శ్రీలీలని ఫైనల్ చేశారట. ఇందులో మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఫైనల్‌గా శ్రీలీలనే ఎంపిక చేశారట.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో బాలకృష్ణ `భగవంత్ కేసరి`, పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్`, మహేష్‌బాబు `గుంటూరు కారం` చిత్రాలతోపాటు యంగ్ హీరోలలో రామ్‌తో `స్కంధ`, నితిన్‌తో `ఎక్ట్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్`, వైష్ణవ్ తేజ్‌తో `ఆది కేశవ`, విజయ్ దేవరకొండతో `వీడీ 12`(గౌతమ్ తిన్ననూరి మూవీ) చేస్తుంది. అలాగే నవీన్ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, కిరీటీ రెడ్డితో `జూనియర్` చిత్రాలు చేస్తుంది. `జూనియర్` మూవీపై డౌట్ ఉంది. వీటితోపాటు పాటు రవితేజ, గోపీచంద్ మలినేని మూవీలో కూడా శ్రీలీల పేరు వినిపిస్తుంది. అలాగే చిరంజీవి, శర్వానంద్, త్రిష ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న కళ్యాణ్ కృష్ణ చిత్రంలోనూ శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఇలా పది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల.