సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆశీస్సులు తీసుకున్న‌ సూప‌ర్ స్టార్ రజినీకాంత్

Published : Aug 19, 2023, 10:35 PM IST
సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాల‌కు న‌మ‌స్క‌రించి ఆశీస్సులు తీసుకున్న‌ సూప‌ర్ స్టార్ రజినీకాంత్

సారాంశం

Tamil actor Rajinikanth: ఉత్తర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాల‌కు న‌మ‌స్క‌రించి త‌మిళ‌ సినీ న‌టుడు, సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. రజనీకాంత్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

వివరాల్లోకెళ్తే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు రజనీ నమస్కరించారు.

నటుడు రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం ఆగస్ట్ 10న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంలో జైలర్ విడుదలకు ముందు హిమాలయాలకు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన నటుడు రజనీకాంత్.. రిషికేశ్, బద్రీనాథ్, ద్వారక, బాబాజీ గుహతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి ప్రస్తుతం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌కు పయనమవుతున్నారు. ఈ క్ర‌మంలోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను కలిసిన రజనీకాంత్, ఈ సంద‌ర్భంగా సీఎం యోగి పాదాల‌ను ర‌జ‌నీ తాకిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

హిమాలయాల్లో ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని నటుడు రజనీకాంత్ నిన్న జార్ఖండ్ వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను కలిసిన అనంతరం రజనీకాంత్ యాకోటా ఆశ్రమానికి చెందిన గురు పరహంస యోగానందను కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత రాంచీ ప్రయాణం ముగించుకుని నిన్న రాత్రి విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈరోజు ఉదయం జైలర్ సినిమాని చూసి ఆనందించారు. 

కాగా, నటుడు రజనీకాంత్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఆయన పాదాలపై పడి ఆశీస్సులు పొందారు. యోగి ఆదిత్యనాథ్‌ను రజనీకాంత్‌ కలిసిన వీడియో, ఫోటోలు ఆయన పాదాలపై పడి నమస్కరిస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?
'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. చిరంజీవి నన్ను పిలిచి ఇలా అన్నాడు'