సమంత స్థానంలో రష్మిక మందన్నా.. చికెన్‌ కోలిపుట్టు వంటతో వాహ్‌ అనిపించింది!

Published : Nov 24, 2020, 02:49 PM ISTUpdated : Nov 24, 2020, 06:14 PM IST
సమంత స్థానంలో రష్మిక మందన్నా.. చికెన్‌ కోలిపుట్టు వంటతో వాహ్‌ అనిపించింది!

సారాంశం

తాజాగా రష్మిక సందడి చేస్తుంది. గత రెండు వారాలుగా రష్మిక తనదైన కొత్త వంటకాలను పరిచయం చేస్తుంది. హెల్దీ ఫుడ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. తాజాగా మరో కొత్త ఫుడ్‌ని పరిచయం చేశారు.

చిరంజీవి కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కామినేని ప్రతి ఆదివారం `యువర్‌ లైఫ్‌` పేరుతో వెబ్‌ పోర్టల్‌ని రన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సమంత గెస్ట్ ఎడిటర్‌గా దీన్ని రన్‌ చేస్తున్నారు. మొదట్లో ఆమె సహజమైన వంటలు చేసి ఆకట్టుకున్నారు. తాజాగా రష్మిక సందడి చేస్తుంది. గత రెండు వారాలుగా రష్మిక తనదైన కొత్త వంటకాలను పరిచయం చేస్తుంది. హెల్గీ ఫుడ్‌పై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. 

తాజాగా స‌మంత స్థానంలో టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ రష్మిక మందన్నాని గెస్ట్ ఎడిటర్‌గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్దీ ఫుడ్‌లో భాగంగా ఈ ఆదివారం చికెన్‌తో కోలిపట్టు కూర వండి ఉపాసనకి రుచి చూపించింది. కోలిపుట్టు కూరని రుచిచూసిన ఉపాసన రష్మికకి వంద మార్కులేయండం విశేషం.  రష్మిక సూపర్‌ చెఫ్‌ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైనా చెఫ్‌గా అవకాశం ఇస్తే సూపర్‌ వంట చేస్తుందని ప్రశంసలతో ముంచెత్తింది ఉపాసన.

 ప్రస్తుతం ఈ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రష్మిక ప్రస్తుతం `పుష్ప`, `ఆడాళ్లు మీకు జోహార్లు`తోపాటు కన్నడలో `పోగరు`, తమిళంలో `సుల్తాన్‌` చిత్రంలో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?