టాలీవుడ్‌కి పూర్వ వైభవంః మహేష్‌, రాజమౌళి, పూరీ ధన్యవాదాలు

By Aithagoni RajuFirst Published Nov 24, 2020, 2:01 PM IST
Highlights

 సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 
 

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకి వరాలు కురిపించింది. హడావుడిగా థియేటర్ల అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రామ్‌చరణ్ వంటి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హీరో మహేష్‌బాబు, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, నిర్మాతలు స్పందించి ధన్యవాదాలు చెబుతున్నారు. మహేష్‌బాబు స్పందిస్తూ, `తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద ఊరట. పెద్ద తెరపై సినిమాలు చూడటం, పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి సహాయక చర్యలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎంకి, కేటీఆర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని తెలిపారు. 

A huge leap for TFI!! Thanking our government for all the relief measures being announced to keep alive the tradition of watching films on the big screen and sustaining lives of millions working in the industry.

— Mahesh Babu (@urstrulyMahesh)

రాజమౌళి స్పందిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంతోషిస్తుంది. కచ్చితంగా మళ్ళీ పురోగతి మార్గంలో పరిశ్రమ నడుస్తుందని నమ్ముతున్నా. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌కి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. 

The Telugu film industry is rejoicing with the much-needed relief measures announced by Telangana CM KCR garu!
These will surely set the ball rolling again in the path of progress... :)
Thankful to you sir🙏🏻

— rajamouli ss (@ssrajamouli)

అలాగే పూరీ జగన్నాథ్‌ సైతం కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీరితోపాటు గీతా ఆర్ట్స్, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

We are extremely pleased that the Government has come up with such relief measures for the Telugu film industry, a much needed decision in this crucial times.
Thank you Honorable Telangana CM shri garu. 🙏🏽

— PURIJAGAN (@purijagan)

Heartfelt thanks to Honorable CM Sri KCR Garu, the government of Telangana for announcing various relief measures towards the film industry. pic.twitter.com/I3dB8PTuVL

— Geetha Arts (@GeethaArts)
click me!