`ఆడవాళ్లు మీకు జోహార్లు` రష్మిక లుక్‌ ఇదేనా?.. మరో `గీతగోవిందం` అవుతుందా?

Published : Jul 28, 2021, 09:22 AM IST
`ఆడవాళ్లు మీకు జోహార్లు` రష్మిక లుక్‌ ఇదేనా?.. మరో `గీతగోవిందం` అవుతుందా?

సారాంశం

టైటిల్‌ ప్రకారం ఈ సినిమా మహిళా ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో రష్మిక పాత్ర సైతం అంతే ప్రయారిటీ కలిగి ఉంటుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా  తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైంది. `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. `రెడ్‌` తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు రష్మిక ముంబయి నుంచి వచ్చింది. అయితే టైటిల్‌ ప్రకారం ఈ సినిమా మహిళా ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. ఇందులో రష్మిక పాత్ర సైతం అంతే ప్రయారిటీ కలిగి ఉంటుందని చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

తాజాగా ఈ చిత్రంలోని రష్మిక లుక్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆమె రెడీ అవుతున్న దృశ్యాన్ని  షూట్‌ చేయగా, అది మానిటర్‌లో కనిపిస్తుంది. దాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇప్పుడీ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక ట్రెడిషనల్‌గా, మరింత అందంగా కనిపిస్తుంది. చూడబోతే `గీతగోవిందం` తర్వాత మరోసారి అలాంటి పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తుందని తెలుస్తుంది. 

ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌ సరసన `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తుంగా, సుకుమార్‌ రూపొందిస్తున్నారు. దీన్ని ఆగస్ట్ 13న విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. మరో రిలీజ్‌ డేట్‌ని ఇంకా వెల్లడించలేదు. మరోవైపు రష్మిక హిందీలోకి ఎంట్రీ ఇస్తూ సిద్ధార్థ్‌ మల్హోత్రాతో `మిషన్‌ మజ్ను`, అమితాబ్‌తో కలిసి `గుడ్‌ బై` చిత్రాలతోపాటు మరో సినిమా చేయనుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌