రాజ్‌కుంద్రాకి ముంబయి హైకోర్ట్ షాక్‌.. బెయిల్‌ నిరాకరణ.. 14రోజుల రిమాండ్‌

By Aithagoni RajuFirst Published Jul 27, 2021, 8:28 PM IST
Highlights

నేటి(జులై 27)తో రాజ్‌కుంద్రా కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ని ముంబయి హైకోర్ట్ తిరస్కరించింది. 

రాజ్‌కుంద్రాకి మరో షాక్‌ తగిలింది. ముంబయి హైకోర్ట్ పెద్ద షాక్‌ ఇచ్చింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ని మంగళవారం కొట్టేసింది. అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన్ని ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. అయితే నేటి(జులై 27)తో ఆయన కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ని ముంబయి హైకోర్ట్ తిరస్కరించింది. పిటిషన్‌ని కొట్టివేస్తూ 14 రోజులపాటు జ్యూడీషియల్‌ కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో మరో 14 రోజులపాటు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు  రాజ్‌కుంద్రా. 

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఎర చూపి అమ్మాయిలతో రాజ్‌కుంద్రా నీలి చిత్రాలనురూపొందిస్తున్నట్టు ఆరోపణలో ఆయన్ని, ఆయనతోపాటు కొంత మందిని పోలీసులు ఈ నెల 19న అరెస్ట్ చేశారు. మూడు రోజుల అనంతరం రాజ్‌కుంద్రా బెయిల్‌ కోసం అప్సీల్‌ చేసుకోగా, కోర్ట్ తిరస్కరించింది.ఇప్పుడు మరోసారి ఆయన బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు ముంబై అంధేరిలో రాజ్ కుంద్రా వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో పోలీసులు సోదాలు జ‌రిపిన‌ప్పుడు సీక్రెట్ అల్మ‌రాలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో క‌రెన్సీకి సంబంధించిన ప‌త్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 

ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రికీ లింకులున్నాయి అనే వివ‌రాల‌ను పోలీసులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే ఫోర్నోగ్ర‌ఫీలో భాగ‌మైన వారిని ప్ర‌శ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయ‌డం దుమారం రేపుతుంది. అలాగే రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టిని విచారించారు. తన ప్రమేయం లేదని, తనకు ఈ విషయాలు తెలియదని ఆమె పోలీసుల ఎదుట కన్నీళ్లు పెట్టుకుందని బాలీవుడ్‌ మీడియా ద్వారా తెలుస్తుంది. 
 

click me!