రాజమౌళిని ఓ ఆట ఆడుకున్న ఎన్టీఆర్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సెట్‌లో లీక్డ్ వీడియో వైరల్‌

Published : Jul 27, 2021, 09:11 PM IST
రాజమౌళిని ఓ ఆట ఆడుకున్న ఎన్టీఆర్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సెట్‌లో లీక్డ్ వీడియో వైరల్‌

సారాంశం

 బిజీ షెడ్యూల్‌లో కాస్త రిలీఫ్‌ పొందుతున్నారు ఎన్టీఆర్‌, రాజమౌళి. తాజాగా వీరిద్దరు సెట్‌లో వాలీబాల్‌ ఆడుతూ కనిపించారు. ఓ టీమ్‌లో ఎన్టీఆర్‌, ఆపోజిట్‌ టీమ్‌ లో రాజమౌళి ఉన్నారు.

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కలిసి రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. ఇండియన్‌ సినిమా మొత్తం ఈ సినిమా కోసం చూస్తోంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న చిత్రం మిగిలిన రెండు పాటల చిత్రీకరించుకుంటోంది. శరవేగంగా షూటింగ్‌ చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ ఆలస్యమైంది. దీంతో ఏమాత్రం ఆలస్యం లేకుండా సినిమాని పూర్తి చేసే పనిలో జక్కన్న టీమ్‌ బిజీ అయ్యింది. 

అయితే తాజాగా బిజీ షెడ్యూల్‌లో కాస్త రిలీఫ్‌ పొందుతున్నారు ఎన్టీఆర్‌, రాజమౌళి. తాజాగా వీరిద్దరు సెట్‌లో వాలీబాల్‌ ఆడుతూ కనిపించారు. ఓ టీమ్‌లో ఎన్టీఆర్‌, ఆపోజిట్‌ టీమ్‌ లో రాజమౌళి ఉన్నారు. ఇందులో రాజమౌళి సైడ్‌కి ఉంటూ గేమ్‌ ఆడుతుండగా, ఎన్టీఆర్‌ సెంటర్‌ని చూసుకుంటున్నాడు. చాలా ఎక్స్ పర్ట్ మాదిరిగా ఎన్టీఆర్‌ ఈ వాలీబాల్‌ గేమ్‌ ఆడటం ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో రామ్‌చరణ్‌ ఉన్నాడా? లేడా? అన్నది సస్పెన్స్ గా మారింది. అపోజిట్‌ టీమ్‌లో ఆయన ఉన్నారా? లేక టీమ్‌ మెంబరా అన్నది తెలియదు.

అయితే సెట్‌లో వీరు గేమ్‌ ఆడుతుండగా, యూనిట్‌లో ఒకరు సీక్రెట్‌గా వీరి గేమ్‌ని ఫోన్‌ కెమెరాల్లో బంధించారు. దీన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగా, ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే ఆగస్ట్ 1, ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` నుంచి మంచి గిఫ్ట్ ఇవ్వబోతుంది యూనిట్‌. ఓ సాంగ్‌ని విడుదల చేయబోతుంది. తాజాగా మంగళవారం ఈ విషయాన్నిప్రకటించారు. ఈ మేరకు ఓ కీరవాణి బృందంతో కూడిన ఫోటోని పంచుకోగా అది కూడా వైరల్‌ అయ్యింది. ఇది ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ అని తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి