రష్మిక మందన్నా మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్‌ ఫ్రెండ్‌` స్టార్ట్..

Published : Nov 28, 2023, 01:39 PM ISTUpdated : Nov 28, 2023, 01:41 PM IST
రష్మిక మందన్నా మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `ది గర్ల్‌ ఫ్రెండ్‌` స్టార్ట్..

సారాంశం

రష్మిక మందన్నా జోరు కొనసాగుతుంది. ఆమె ఓ వైపు భారీ పాన్‌ ఇండియా మూవీస్‌ చేస్తుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తుంది. తాజాగా కొత్త మూవీ ప్రారంభమైంది. 

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా.. ఓ వైపు భారీ కమర్షియల్‌ మూవీస్‌ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తుంది. తమిళం, తెలుగులో `రెయిన్‌ బో` అనే మూవీ చేస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. `ది గర్ల్ ఫ్రెండ్‌` చేసేందుకు గతంలోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ మూవీ నేడు ప్రారంభం కావడం విశేషం. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఈ మూవీని ప్రారంభించారు. 

``ది గర్ల్ ఫ్రెండ్` సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, స్టార్ డైరెక్టర్ మారుతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేశ్ ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుందని టీమ్‌ వెల్లడించింది. ఇక ఈ మూవీని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. 

ఆ మధ్య సినిమా ప్రకటించిన సమయంలో టైటిల్‌ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో రష్మిక వాటర్‌లో మునిగి ఉండటం, ఆమె నవ్వుతూ ఆ తర్వాత ఏడుస్తూ, భయపడుతూ కనిపించింది. ఒక ఫ్రెష్‌ లవ్ స్టోరీగా, అదే సమయంలో వినూత్నమైన, ప్రయోగాత్మకమైన ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. హీరోగా సక్సెస్‌ కాలేని రాహుల్‌ రవీంద్రన్ దర్శకుడిగా మారి `చి.ల.సౌ` చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన `మన్మథుడు 2` డిజప్పాయింట్‌ చేసింది. దీంతో గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

Read more: Animal ఈవెంట్‌లో రష్మికకి మహేష్‌ హగ్‌పై పేలుతున్న సెటైర్లు.. ఇంటికెళ్లాక నమ్రతతో ఉంటుంది చూడూ.. ఇదెక్కడి గోల

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు