`పుష్ప`(pushpa) నుంచి ఫస్ట్ లుక్, అల్లు అర్జున్(allu arjun) లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. వీటికి అద్భుతమైన స్పందన లభించింది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్(pushpa update)ని ఇవ్వబోతున్నారు యూనిట్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun), రష్మిక మందన్నా(rashmika mandanna) జంటగా నటిస్తున్న చిత్రం `పుష్ప`(pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రమిది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాని డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, అల్లు అర్జున్ లుక్, టీజర్, ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. వీటికి అద్భుతమైన స్పందన లభించింది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ని ఇవ్వబోతున్నారు యూనిట్. `పుష్ప`లో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్నా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయబోతున్నారు. రేపు(బుధవారం) ఉదయం 9.45గంటలకు రష్మిక మందన్నా అమేజింగ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని సాంగ్ షూటింగ్‌కి సంబంధించిన ఓ బ్యూటీఫుల్‌ని లొకేషన్‌ని పంచుకుంది యూనిట్. ఈ పిక్స్ వైరల్ అయ్యాయి.
Raw & Intense Look of is all set to amaze you!
Meet our 's Love tomorrow at 9:45 AM ♥️ 🤙 pic.twitter.com/O8z6Dto4Lw
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో `పుష్ప` చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్రేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు.