మూడు వారాలు హౌస్ లో ఉన్న లహరి ఎంత తీసుకున్నారంటే?

Published : Sep 28, 2021, 03:41 PM IST
మూడు వారాలు హౌస్ లో ఉన్న లహరి ఎంత తీసుకున్నారంటే?

సారాంశం

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా కాలం ఉంటుందని భావించిన లహరి మూడు వారాలకే దుకాణం సర్దింది.మూడు వారాలు హౌస్ లో ఉన్న లహరి ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

ఈ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులకు కొంచెం షాక్ ఇచ్చింది. వారం మొత్తం నడిచిన వివాదంలో రవిని కన్నింగ్ వ్యక్తిగా, ప్రియ లహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తేల్చాడు హోస్ట్ నాగార్జున. రవి, ప్రియ వలన లహరి బలైనట్లు చెప్పాడు. చివరకు ఎలిమినేషన్స్ లో ప్రియను సేవ్ చేసి లహరిని ఇంటికి పంపారు. 


స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చాలా కాలం ఉంటుందని భావించిన లహరి మూడు వారాలకే దుకాణం సర్దింది. నిజంగా ఎక్కువ సమయం అబ్బాయిలతో గడపడం, అతి కోపం, అరవడం కూడా ఆమెకు మైనస్ గా మారి ఉండవచ్చు. కారణం ఏదైనా లహరి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటయ్యారు. 


మూడు వారాలు హౌస్ లో ఉన్న లహరి ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. లహరి వారానికి లక్షన్నర నుండి రెండు లక్షల ఒప్పందంపై హౌస్ లోకి వెళ్లారట. కావున మూడు వారాలకు గాను ఆమె, ఐదు నుండి ఆరు లక్షల వరకు రెమ్యూనరేషన్ గా అందుకునే అవకాశం కలదు అంటున్నారు. హౌస్ లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నవారిలో లహరి కూడా ఒకరని సమాచారం. అత్యధికంగా యాంకర్ రవి, షణ్ముఖ్, లోబో తీసుకుంటున్నారట. 

PREV
click me!

Recommended Stories

55 ఏళ్ల వయసులో 300 సినిమాలు, 200 కోట్లకు పైగా ఆస్తి, స్టార్ డైరెక్టర్ ను పెళ్లాడిన హీరోయిన్ ఎవరు?
Boyapati Sreenu: చిరంజీవితో బోయపాటి సినిమా ఎందుకు చేయలేదో తెలుసా ? బాలకృష్ణ అఖండ వల్ల అంత జరిగిందా..