రష్మికా మందన్నా బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. భారీ చిత్రంలో.. అక్కడ కూడా దున్నేస్తుందా?

Published : Dec 23, 2020, 02:48 PM IST
రష్మికా మందన్నా బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. భారీ చిత్రంలో.. అక్కడ కూడా దున్నేస్తుందా?

సారాంశం

గత ఏడాది కాలంగా రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు పుల్ స్టాప్‌ పెడుతూ, కొత్త చిత్రాన్ని ప్రకటించింది. యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది.

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మికా బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ భారీ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతుంది. యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది. గత ఏడాది కాలంగా రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు పుల్ స్టాప్‌ పెడుతూ, కొత్త చిత్రాన్ని ప్రకటించింది. 

సిద్ధార్థ్ సరసన `మిషన్‌ మంజు` చిత్రంలో నటించనుంది. ఇది రియలిస్టిక్‌ కథతో తెరకెక్కుతుంది. ఇండియా నిర్వహించిన ఓ గొప్ప కోవర్ట్ ఆపరేషన్‌ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దీనికి శాంతను బాగ్‌చీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని ప్రకటించడంతోపాటు, ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా ఈ పోస్టర్‌ ఉంది. ఇందులో వెనకాల బిల్డింగ్‌లు కూలిపోవడం, కాలిపోతుంటే ఆ మంటల్లో నుంచి సిద్ధార్థ్‌ గన్‌ పట్టుకుని కోపంగా నడుచుకుంటూ వస్తున్న లుక్‌ సినిమాపై హైప్‌ని పెంచుతుంది. 

తెలుగులో `ఛలో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయిన రష్మిక ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హిందీలోకి అడుగుపెడుతుంది. మరి అక్కడ కూడా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదుగుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరి బాలీవుడ్‌లో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్‌ తో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఆడాళ్లు మీకు జోహార్లు`, తమిళంలో `సుల్తాన్‌`, కన్నడలో `పొగరు` చిత్రంలో నటిస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా