నేను అరెస్ట్ కాలేదు..ఆ వార్తలు బాధ్యతారహితమైనవిః హృతిక్‌ మాజీ భార్య ఫైర్‌

Published : Dec 23, 2020, 01:51 PM IST
నేను అరెస్ట్ కాలేదు..ఆ వార్తలు బాధ్యతారహితమైనవిః హృతిక్‌ మాజీ భార్య ఫైర్‌

సారాంశం

నైట్‌ క్లాబ్‌లో అరెస్ట్ అయిన బెయిల్‌పై విడుదలైనట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై తాజాగా హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ స్పందించారు. తాను అరెస్ట్ కాలేదని తెలిపారు. తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలనీ పేర్కొన్నారు. 

తాను నైట్‌ క్లాబ్‌లో అరెస్ట్ అయిన బెయిల్‌పై విడుదలైనట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై తాజాగా హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్‌ స్పందించారు. తాను అరెస్ట్ కాలేదని తెలిపారు. తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలనీ పేర్కొన్నారు. అసలు విషయాలు తెలుసుకోకుండా వార్తలు రాయడంపై ఆమె ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు సుసానే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. 

ఇందులో ఆమె చెబుతూ, `సోమవారం రాత్రి క్లోజ్‌ ఫ్రెండ్‌ బర్త్ డే పార్టీ కోసం ముంబయిలోని మారియట్‌లోని డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. డిన్సర్‌ టైమ్‌ ఎక్స్ టెండ్‌ అయ్యింది. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో అధికారులు వచ్చారు. కొత్తగా విధించిన కరోనా నిబంధనల గురించి చెక్‌ చేశారు. యాజమాన్యంతో మాట్లాడారు. కరోనా నిబంధనల మేరకు మరో మూడు గంటలు బయటకు వెళ్లకూడదన్నారు. దీంతో అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉదయం ఆరు గంటలకు మమ్మల్ని బయటకు పంపించారు. నేను అరెస్ట్ అయ్యానంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి పూర్తిగా అవాస్తవాలు. బాధ్యతారహితమైనవి` అని మండిపడ్డారు. 

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నైట్‌ క్లబ్‌లు, పబ్‌లో ఇలా అన్ని రాత్రి 11.30వరకు మూసివేయాలి. దానికి విరుధ్ధంగా అర్థరాత్రి తర్వాత కూడా క్లబ్‌ని తెరిచి ఉంచినందుకు డ్రాగన్‌ క్లబ్‌ నిర్వహకులను, అందులో ఉన్న 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, మార్నింగ్‌ విడిచిపెట్టారని వార్తలు వినిపించాయి. ఇందులో క్రికెటర్‌ సురేష్‌ రైనా, హృతిక్‌ మాజీ భార్య సుసానే ఖాన్ వంటి వారు ఉన్నారు. ఇందులో తన పేరు రావడంతో సుసానే తాజాగా స్పందించి వివరణ ఇచ్చింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్