
రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ `యానిమల్`. రణ్ బీర్ కపూర్ హీరోగా చేసిన చిత్రమిది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో రన్ అవుతుంది. భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో కొంత నెగటివ్ టాక్ కూడా వస్తోంది.
ఈ నేపథ్యంలో తన సినిమాపై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తనదైన స్టయిల్‌లో రివ్యూ ఇచ్చుకుంది. తన పాత్రపై ఆమె రివ్యూ ఇవ్వడం విశేషం. తాను ఇందులో గీతాంజలి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాత్ర గురించి చెబుతూ ఎమోషల్ పోస్ట్ పెట్టింది రష్మిక. ఇందులో ఆమె చెబుతూ, ఈ సినిమాలోని తన పాత్ర ప్రతి మహిళకి ఆదర్శమని, ఈ సినిమా చూశాక మహిళ తన పిల్లలను, కాపాడుకోవడానికి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో తెలియజేస్తుందని చెప్పింది.
రష్మిక చెబుతూ, ఇందులో గీతాంజలి తన కుటుంబాన్ని ఒక్క చోట చేర్చే ఏకైక శక్తి ఇంట్లోనే ఉందని నిరూపించిందన్నారు. ఆమె స్వచ్ఛమైనదని, నిజాయితీగా ఉంటుందని, వడకట్టబడనిదని, బలమైనదని తెలిపింది. ఒక్కోసారి నటిగా తాను గీతాంజలి చర్యలను ప్రశ్నిస్తానని చెప్పింది. దర్శకుడు తనతో చెప్పిన విషయం తనకు ఇంకా గుర్తుందని, ఇది రణ్ విజయ్, గీతాంజలిల కథ. అది వారి ప్రేమ, అభిరుచి, వారి కుటుంబాలు, వారి జీవితాలకు సంబంధించినదని తెలిపింది రష్మిక.
హింస, బాధ, భరించలేని బాధలతో నిండిన ప్రపంచంలో గీతాంజలి శాంతి విశ్వాసాన్ని, ప్రశాంతతని కలిగిస్తుందని, ఆమె తన భర్తని, పిల్లలను సురక్షితంగా ఉంచమని ఆమె దేవుళ్లని ప్రార్థిస్తుందని, ఆమె అన్ని రకాల తుఫానులను ఎదుర్కొన్న శిల అంటూ, ఆమె తన ఫ్యామిలీ కోసం తన శక్తి మేరకు ఏమైనా చేస్తుందన్నారు. గీతాంజలి తన దృష్టిలో చాలా అందంగా ఉందని, కొన్ని విషయాల్లో ఆమె చాలా మంది మహిళలను ప్రతిబింబిస్తుందని, తన కుటుంబాన్ని కాపాడటం కోసం పోరాడుతుందని చెప్పింది. ఇక చివరగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది రష్మిక. మీ ప్రేమకి ధన్యవాదాలు. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రతి సినిమాతో మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుందని, అందరికి హగ్స్ ఇచ్చింది రష్మిక.