నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ కి ఎన్టీఆర్ ఆతిథ్యం... ఆ విషయంలో పోటీపడుతున్న ఆర్ ఆర్ ఆర్ హీరోలు! 

By Sambi ReddyFirst Published Dec 8, 2023, 7:24 PM IST
Highlights


నిన్న రామ్ చరణ్, చిరంజీవి నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్, సీఈఓ టెడ్ సరండోస్ తో భేటీ అయ్యారు. నేడు ఎన్టీఆర్ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. 
 

నెట్ఫ్లిక్స్ సీఈఓ, గ్లోబల్ హెడ్ టెడ్ సరండోస్ ఫస్ట్ టైం హైదరాబాద్ లో అడుగుపెట్టారు. వస్తూనే ఆయన చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, రామ్ చరణ్ లతో టెడ్ సరండోస్ ముచ్చటించారు. వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నెట్ఫ్లిక్స్ హెడ్ టెడ్ సరండోస్ భేటీ పతాక శీర్షికలకు ఎక్కింది. కాగా నేడు మరో ఆర్ ఆర్ ఆర్ స్టార్ ఎన్టీఆర్ టెడ్ సరండోస్ కి ఆతిథ్యం ఇచ్చారు. 

నేడు మధ్యాహ్నం టెడ్ సరండోస్ తో పాటు ఆయన టీమ్ కి ఎన్టీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. వారి మధ్య సినిమా గురించి ఆసక్తికర చర్చ నడిచినట్లు తెలుస్తుంది. టెడ్ సరండోస్ తో భేటీకి సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. టెడ్ సరండోస్ టీమ్ కి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది అన్నారు. 

Latest Videos

ఈ క్రమంలో సినిమాపై ప్రేమ, ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లు ఎన్టీఆర్ తన కామెంట్ ద్వారా తెలియజేశాడు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక రోజు వ్యవధిలో టెడ్ సరండోస్ ని కలవడం టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. వీరితో దేవర డైరెక్టర్ కొరటాల శివ, హీరో కళ్యాణ్ రామ్ కూడా జాయిన్ అయ్యారు. ఎన్టీఆర్-టెడ్ సరండోస్ ల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

చిరంజీవి నివాసానికి నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్... మెగా హీరోలతో భేటీ!

రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ని నెట్ఫ్లిక్స్ హెడ్ కలవడం వాళ్లకు కలిసొచ్చే అంశమే. ఇండియాలో నెట్ఫ్లిక్స్ కి చెప్పుకోదగ్గ ఆదరణ లేదు. సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి, రెవిన్యూ జనరేషన్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. హాట్ స్టార్, ప్రైమ్ తో పోల్చుకుంటే నెట్ఫ్లిక్స్ ఎక్కడో ఉంది. కొన్నాళ్లుగా వారు స్టార్ హీరోల చిత్రాలపై దృష్ఠి పెట్టారు.

మెగా, నందమూరి హీరోలను నెట్ఫ్లిక్స్ హెడ్ కావడంతో కొంత ప్రచారం దక్కుతుంది. మరోవైపు ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. విడుదల తేదీ సమీపిస్తుండగా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

click me!