రష్మిక మందన్నా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్ లుక్‌.. కానీ `పుష్ప` నుంచి నో బర్త్ డే గిఫ్ట్..

Published : Apr 05, 2021, 03:34 PM ISTUpdated : Apr 05, 2021, 03:35 PM IST
రష్మిక మందన్నా `ఆడవాళ్లు మీకు జోహార్లు`  ఫస్ట్ లుక్‌.. కానీ `పుష్ప` నుంచి నో బర్త్ డే గిఫ్ట్..

సారాంశం

రష్మిక మందన్నా బర్త్ డే సందర్బంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం బృందం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. కానీ అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` టీమ్‌ మాత్రం రష్మిక ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసింది. 

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా నేడు తన 25వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. `ఛలో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత `గీతగోవిందం`తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. `దేవదాస్‌`, `డియర్‌ కామ్రేడ్‌` చిత్రాలతో ఆకట్టుకుంది. `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్‌ బ్యూటీ అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్‌, విలన్‌, ఫస్ట్ గ్లింప్స్ వచ్చాయి. త్వరలోనే పుష్పరాజ్‌ పాత్రని పరిచయం చేయబోతున్నారు. 

కానీ పుష్ప` విషయంలో రష్మిక మందన్నాకి అన్యాయం జరుగుతుందనే టాక్‌ వినిపిస్తుంది. ఎందుకంటే నేడు(సోమవారం) రష్మిక బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ని విడుల చేస్తుంటారు. కానీ కేవలం విషెస్‌ చెప్పి సరిపెట్టుకుంది సుకుమార్‌ టీమ్‌. దీంతో రష్మిక ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అవుతున్నారట. ఆమె నటిస్తున్న మరో తెలుగు సినిమా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఓ పార్క్ లో బంతిపూల దండ కూర్చుతూ చీరకట్టులో రష్మిక ఎంతో అందంగా ఉంది. శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె లుక్‌ రావడంతో `పుష్ప` యూనిట్‌పై ఒత్తిడి పెంచుతున్నారు రష్మిక ఫ్యాన్స్ . మరి స్పందిస్తారో లేదో చూడాలి. 

రష్మిక తమిళంలో నటించిన `సుల్తాన్‌` చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనని తెచ్చుకుంటోంది. మరోవైపు ఈ అమ్మడు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `మిషన్‌మజ్ను`, అమితాబ్‌తో ఓ సినిమా చేస్తుంది. దీనికి `గుడ్‌బై` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్