
అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి `పుష్ప2` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే నేడు(ఏప్రిల్5) రష్మిక మందన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన సినిమా లుక్‌ని విడుదల చేసింది యూనిట్. శ్రీవల్లిగా ఆమె ఎలా రచ్చ చేయబోతుందో చూపిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఆమెకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇవ్వడం విశేషం.
రష్మిక మందన్నా పుట్టిన రోజు సందర్భంగా `పుష్ప2`కి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో తిరుపతి జైల్ నుంచి(2004) బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. పుష్ప ఎక్కడ అంటూ టీవీ యాంకర్ల బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో ప్రారంభమైంది. ఇందులో ఓ బైక్‌పై పుష్ప తప్పించుకుని పోతున్నట్టు చూపించారు. ఇందులో పుష్ప కోసం జనాలు నిరసనలు తెలియజేస్తుండగా, వారిని పోలీసులు చెదరగొడుతుండటం వీడియోలో చూపించింది. పుష్ప మిస్పింగ్, పుష్ప ఎక్కడ అనేది ఇప్పుడు ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠభరింతంగా సాగుతుంది. 2004లో జరిగినట్టుగా దీన్న
అంతేకాదు `రూల్ చేయడానికి ముందు హంట్` అంటూ ఇందులో పేర్కొనడం విశేషం. ఇక జైలు నుంచి తప్పించుకుని పుష్పరాజ్ తాను ఎర్రచందనం మాఫియాని శాషించబోతున్నాడనే కోణంలో రెండో భాగం సాగుతుందని తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ ని చూపించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ నెల 7న రాబోతుందని తెలిపారు. ఏడున(శుక్రవారం) సాయంత్రం నాలుగు గంటలకు వెల్లడించబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో గ్లింప్స్ ఆద్యంతం వైరల్ అవుతుంది. ఇది బన్నీ ఫ్యాన్స్ కి సడెన్ సర్‌ప్రైజ్‌లా ఉండబోతుందని చెప్పొచ్చు.
గత రెండేళ్లుగా `పుష్ప2`కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఫైనల్లీ ఆ నిరీక్షణకి తెరపడింది. రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చారు. దీంతోపాటు ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `పుష్ప2`కి సంబంధించిన కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేయబోతున్నారట. అలాగే ఎనిమిదిన బన్నీ కొత్త లుక్ విడుదల చేస్తారని సమాచారం.
ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప2`లో బన్నీ, రష్మిక జంటగా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్‌గా, సునీల్, అనసూయ, జగదీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుందని సమాచారం.