
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ఇండియా మొత్తం యువతలో మ్యాజిక్ చేసింది. ఈ చిత్రానికి విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదరగొట్టేసింది. రష్మిక ఎప్పటిలాగే బోల్డ్ గా రొమాన్స్ సీన్స్ లో మెప్పించింది. ఎమోషనల్ గా కూడా నటించింది. అంతకు ముందే రష్మిక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది.
అయితే పుష్ప తర్వాత రష్మిక కి బాలీవుడ్ లో అంతగా ఆఫర్స్ రాలేదు. పుష్ప చిత్రంలో ఆమె పోషించిన పాత్రకి సౌత్ ఇండియా టచ్ ఉంటుంది. కాయాన్ని యానిమల్ చిత్రాన్ని సందీప్ రెడ్డి కంప్లీట్ ఆ బాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కించారు. దీనితో ప్రస్తుతం రష్మిక కి బాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి.
తాజాగా రష్మిక ఏకంగా 3 హిందీ చిత్రాలకు ఒకేసారి సైన్ చేసినట్లు బి టౌన్ నుంచి వార్తలు వస్తున్నాయి. యానిమల్ తర్వాత రష్మిక హిందీలో రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. కానీ ఆమె రెమ్యునరేషన్ అక్కడి స్టార్స్ రేంజ్ లో ఉండదు. కాబట్టి రష్మిక రెమ్యునరేషన్ రీజనబుల్ అంటూ నిర్మాతలు ఆమెతో మూవీ చేయడానికి ఓకె చెబుతున్నారు.
ప్రస్తుతం రష్మిక సౌత్ లో పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మిక చేస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రం. అయితే రష్మిక ప్రస్తుతం హిందీలో సైన్ చేసిన మూడు చిత్రాల వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.