రష్మిక `యానిమల్‌` రిలీజ్‌లో మార్పు లేదు.. వచ్చే డేట్‌ పక్కా

Published : Jun 09, 2023, 03:54 PM IST
రష్మిక `యానిమల్‌` రిలీజ్‌లో మార్పు లేదు.. వచ్చే డేట్‌ పక్కా

సారాంశం

యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న `యానిమల్‌` చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలొచ్చాయి.

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా బాలీవుడ్‌లో నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ `యానిమల్‌`. `బ్రహ్మాస్త్ర` ఫేమ్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన చిత్రమిది. `అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. రణ్ బీర్‌, రష్మిక జంటగా నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా బాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ లోనూ ఆసక్తి నెలకొంది. పైగా `అర్జున్‌రెడ్డి` దర్శకుడి సినిమా కావడంతో ఆ ఇంట్రెస్ట్ ఉంది. 

యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలొచ్చాయి. ఇండిపెండెంట్‌ డే నుంచి తప్పుకుంటుందన్నారు. రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో తాజాగా టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. రిలీజ్‌ డేట్‌లో ఏమాత్రం మార్పు లేదని పేర్కొంది. తాజాగా బాలీవుడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేశారు. 

`యానిమల్‌` సినిమా కచ్చితంగా షెడ్యూల్‌ ప్రకారమే రాబోతుందన్నారు. సినిమా పోస్ట్ పోన్‌ కావడం లేదని, వాయిదా రూమర్లని నమ్మవద్దని పేర్కొన్నారు. రణ్‌ బీర్‌ కపూర్‌, సందీప్‌రెడ్డి వంగా తొలిసారి కలిసి చేస్తున్న ఈ సినిమా అనుకున్న టైమ్‌కే, ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందన్నారు. ఈ మేరకు `పోస్ట్ పోన్‌ కావడం లేదు` అనే ఓ కొత్త పోస్టర్‌ని పంచుకున్నారు. దీంతో ఇక సౌత్‌లో త్రిముఖ పోటీ నెలకొనబోతుంది. 

అదే సమయంలో తెలుగులో చిరంజీవి సినిమా `భోళాశంకర్‌`, తమిళంలో రజనీకాంత్‌ `జైలర్‌` సినిమా కూడా అదే టైమ్‌లో రాబోతుంది. చిరంజీవి `భోళాశంకర్‌` ఆగస్ట్ 11న రిలీజ్‌ కాబోతుంది. రజనీకాంత్‌ మూవీ ఒక్క రోజు ముందు ఆగస్ట్ 10న రాబోతుందని సమాచారం. రజనీకాంత్‌ సినిమాలో మోహన్‌లాల్‌, శివరాజ్‌ కుమార్‌ ఉన్నారు. దీంతో సౌత్‌లో ఇది గ్రాండ్‌గా రిలీజ్‌ ఉండబోతుంది. నార్త్ లోనూ రజనీకి భారీ ఫాలోయింగ్‌ ఉంది. అయితే చిరంజీవి సినిమా మాత్రం కేవలం తెలుగులోనే రిలీజ్‌ కాబోతుంది. కాబట్టి ఈసినిమాకి ఇతర భాషలతో సంబంధం లేదు, కానీ ఇతర భాషల సినిమాల ప్రభావం దీనిపై ఉండే అవకావం ఉంది. 

మరోవైపు `యానిమల్‌` సినిమాని సౌత్‌లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో `భోళాశంకర్‌` ఎఫెక్ట్, సౌత్‌లో రజనీ సినిమా ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. వీటిని తట్టుకుని నిలబడుతుందా అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..
500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా