సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’పై ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా క్రిస్ హేమ్స్ వర్త్ తన రివ్యూను ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్, చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గతేడాది సంచలనం సృష్టించిన చిత్రం RRR. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వాతంత్ర్య సమరయోదులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో జీవించారు. వీరి నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖుల నుంచి స్పెషల్ రివ్యూలు దక్కాయి. జక్కన్న డైరెక్షన్, తారక్, చెర్రీ పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. మరోవైపు చిత్రంలోని సెన్సేషనల్ మాస్ సాంగ్ Naatu Naatuకి ఆస్కార్ దక్కడంతోనూ చరిత్ర క్రియేట్ అయ్యింది.
గతేడాది నుంచి ‘ఆర్ఆర్ఆర్’ ఏదోలా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదో చోటు నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇక తాజాగా మార్వెల్ నుంచి వచ్చిన థోర్, అవెంజర్స్ ఫ్రాంచైజీలోని తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన క్రిస్ హేమ్స్‌వర్త్ (Chris Hemsworth) కూడా ఆర్ఆర్ఆర్ పై స్పందించారు. ప్రస్తుతం తను నటించిన ఎక్స్‌ట్రాక్షన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు క్రిస్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్ఆర్ఆర్’పై ఇలా కామెంట్స్ చేశారు.
తన రాబోయే చిత్రం కోసం ప్రమోషనల్ స్ప్రీలో ఉన్న క్రిస్ హేమ్స్‌వర్త్, న్యూస్ 18కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ‘ఇటీవల RRRని చూశాను. అది ఒక అద్భుతమైన చిత్రం. వండర్ ఫుల్ ఫీలింగ్ కలిగింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ బాగుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన నన్ను ఆకట్టుకుంది. వారితో కలిసి పని చేసే అవకాశం వస్తే కలిసి పనిచేస్తాను. అది అద్భుతంగా ఉంటుంది' అని క్రిస్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఇప్పటికే క్రిస్ ఇండియన్ యాక్టర్ రణదీప్ హుడాతో కలిసి పనిచేశారు. అయితే హాలీవుడ్ నటీనటులు కూడా తమ సినిమాలను ఇండియా మరింతగా ప్రమోట్ చేసేందుకు ‘ఆర్ఆర్ఆర్’ను వాడేసుకుంటున్నారని తెలుస్తోంది.రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 3’ చిత్ర ప్రమోషన్స్ లోనూ దర్శకుడు జేమ్ గున్ ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసలు కురిపించారు. తమ సినిమా ప్రమోషన్స్ లో ఇండియన్ సినిమా గురించి మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది. అలాగే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టినచిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా.. డీవీవీ దానయ్య నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హ్యాయెస్ట్ గ్రాసింగ్ చిత్రాల జాబితాలో నాలుగో సినిమాగా చోటుదక్కించుకుంది. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుంది. ఇక ఎన్టీఆర్ ‘దేవర’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.