రష్మిని బాధపెట్టిన నెటిజన్ కామెంట్!

Published : Jan 15, 2019, 10:05 AM IST
రష్మిని బాధపెట్టిన నెటిజన్ కామెంట్!

సారాంశం

బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది. తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.

బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది. తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది.

తాజాగా ఆమె అభిమానులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ భోగి మంటల వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ఓ నెటిజన్.. ''భోగి మంటల వీడియో పెట్టి మకర సంక్రాంతి అని చెబుతున్నారేంటి..?అది భోగి మేడం.. మకర సంక్రాంతి కాదు.. ముందు మీరు తెలుగు నేర్చుకోండి'' అని రిప్లయ్ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన రష్మి బాధ పడినట్లుంది. వెంటనే అతడికి ధీటుగా బదులిచ్చింది. ''మా కుటుంబ మకర సంక్రాంతిని  మాత్రమే జరుపుకుంటుంది. అందుకే అందరికీ విషెస్ చెప్పాను. నేను మీ సంప్రదాయాలను గౌరవించి విష్ చేశా.. మీరు కూడా నన్ను గౌరవించాలి. ఎలాంటి కారణాలు లేకుండా మాట్లాడి బాధించకూడదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే