Rashmi Gautam: మీకసలు నిద్ర ఎలా పడుతుంది... షాకింగ్ వీడియో షేర్ చేసిన రష్మీ గౌతమ్!

Published : Jan 31, 2023, 01:36 PM ISTUpdated : Jan 31, 2023, 01:54 PM IST
Rashmi Gautam: మీకసలు నిద్ర ఎలా పడుతుంది... షాకింగ్ వీడియో షేర్ చేసిన రష్మీ గౌతమ్!

సారాంశం

యాంకర్ రష్మీ ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు. అలాగే ఇలాంటి ఆటలతో వినోదం పొందుతున్న మీకు నిద్ర ఎలా పడుతుందని ప్రశ్నించింది.   

రష్మీ గౌతమ్ యానిమల్ లవర్. ఆమె వీగన్ కూడాను. మూగజీవాలను ఏ రూపంలో కూడా హింసించకూడని నమ్ముతుంది. అందుకే పాలు తాగదు. అలాగే పాలతో తయారయ్యే బై ప్రొడక్ట్స్ తినదు. ప్యూర్ వెజిటేరియన్. ఇక సోషల్ మీడియా వేదికగా జంతు హింసపై పోరాడుతుంది. జనాల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగిన కోడి పందాలను ఆమె వ్యతిరేకించారు. ఈ క్రమంలో నెటిజెన్స్ ఆమెను ట్రోల్ చేశారు. 

తాజాగా రష్మీ గౌతమ్ బుల్ ఫైట్ గేమ్ ని వ్యతిరేకిస్తూ దారుణమైన వీడియో షేర్ చేశారు. యూరప్ లో బుల్ ఫైట్ సాంప్రదాయ క్రీడ. అయితే ఈ క్రీడ వలన జంతువులు హింసకు గరువుతున్నాయనే వాదన ఎప్పటి నుండో ఉంది. పెటా ఆర్గనైజేషన్ ఈ క్రీడను నిషేదించాలని డిమాండ్ చేస్తుంది. వారి వాదనకు మద్దతుగా రింగ్ లో ప్రాణం విడిచిన ఎద్దు వీడియో షేర్ చేశారు. 

పెటా యూకే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ రష్మీ ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ''ఇలాంటి ఆటలతో వినోదం పొందే వాళ్లకు రాత్రివేళ నిద్ర ఎలా పడుతుంది'' అని ట్వీట్ చేశారు. మూగ జీవాలను ప్రాణాలు బలిగొనే ఈ ఆట మీకు వినోదమా? మీరు ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు? అని రష్మీ గౌతమ్ ప్రశ్నించారు. 

ఒకవైపు తన ప్రొఫెషన్ చేసుకుంటూనే రష్మీ ఒక మహత్తర ఉద్యమం కొనసాగిస్తున్నారు. జీవ హింస నేరం అని తెలుసు. దాన్ని అరికట్టేందుకు చట్టాలు కూడా ఉన్నాయి. అయితే అమలవుతాయా అంటే డౌటే. ఇది ఒక్క రోజులో వచ్చే మార్పు కాదు. గతంతో పోల్చితే ప్రజల్లో అవగాహన వచ్చింది. పెట్ లవర్స్ గా మారుతూ జంతు హింస చేయకూడదని భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్