సక్సెస్‌ కోసం నాగార్జున, అల్లరి నరేష్‌ ప్రయోగం.. గట్టేక్కించేనా?

Published : Jan 31, 2023, 11:47 AM IST
సక్సెస్‌ కోసం నాగార్జున, అల్లరి నరేష్‌ ప్రయోగం.. గట్టేక్కించేనా?

సారాంశం

పరాజయాల్లో ఉన్న హీరో నాగార్జున, అల్లరి నరేష్‌ కలిసి సినిమా చేయబోతున్నారు. కొత్త దర్శకుడిగా ఓ ప్రయోగం చేయబోతున్నారు. మరి అది సక్సెస్‌ ఇస్తుందా?

మల్టీ స్టారర్‌ చిత్రాలు చేయడంలో నాగార్జున ముందే ఉంటారు. ఆయన ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ఆయన `బంగార్రాజు`లో తన కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించారు. అంతకు ముందు `దేవదాసు` చిత్రం నానితో కలిసి చేశాడు. `మనం`లో ఫ్యామిలీ అంతా కలిసి చేశారు. ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్‌ తరహా సినిమా చేయబోతున్నారు. అల్లరి నరేష్‌తో కలిసి ఆయన ఓ సినిమాలో నటించబోతుండటం విశేషం. 

పాపులర్‌ రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ దర్శకుడిగా మారి నాగార్జున హీరోగా సినిమా చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అయ్యింది. ఇందులో అల్లరి నరేష్‌ కూడా నటించబోతున్నారని సమాచారం. కమర్షియల్‌ అంశాలను, కామెడీ మేళవింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందని సమాచారం. నాగార్జున చివరగా `ది ఘోస్ట్` చిత్రంలో నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. 

ఈ నేపథ్యంలో కమర్షియల్‌ సినిమా వైపు నాగ్‌ అడుగులు వేస్తున్నారు. రైటర్‌ ప్రసన్న కుమార్‌.. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన చిత్రాలకు రైటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల వీరి కాంబినేషన్‌లో `ధమాకా` వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు `నేను లోకల్‌`, `సినిమా చూపిస్త మావ` వంటి సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు ప్రసన్నకుమార్‌ డైరెక్టర్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

ఇదిలా ఉంటే నాగ్‌ `బంగార్రాజు`తో మెప్పించినా, `ది ఘోస్ట్`తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా రూట్‌ మార్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా అల్లరి నరేష్‌తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారని టాక్‌. మరోవైపు `నాంది` సినిమాతో పూర్వ వైభవాన్ని పొందిన అల్లరి నరేష్‌ ఇటీవల చేసిన `ఇట్లు మారెడుమిల్లి నియోజకవర్గం` చిత్రం పరాజయం చెందింది. దీంతో ఆయన కూడా ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వీరిద్దరికి ఈ ప్రాజెక్ట్ ని ప్రసన్న కుమార్‌ సెట్‌ చేసినట్టు టాక్‌. మరి నాగ్‌, అల్లరి నరేష్‌ సక్సెస్‌ కోసం చేసే ఈ ప్రయోగం ఫలిస్తుందా? లేదా అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే